☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ప్రతీ ఐదుగురిలో ఒకరికి క్రమరహిత పీరియడ్స్.. AIIMS సర్వేలో షాకింగ్ విషయాలు!

భారతదేశంలోని పాఠశాల విద్యార్థినుల్లో పీరియడ్స్ సమస్యలు పెరిగిపోతున్నాయని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సర్వేలో వెల్లడైంది. సర్వే ప్రకారం, ప్రతి ఐదుగురు పాఠశాల విద్యార్థినుల్లో ఒకరు క్రమరహిత పీరియడ్స్ ఎదుర్కొంటున్నారు. అయితే, క్రమరహిత పీరియడ్స్ ఉన్నంత మాత్రాన దానిని వెంటనే పీసీఓఎస్ గా భావించలేమని ఎయిమ్స్ వైద్యులు స్పష్టం చేశారు. ఎయిమ్స్‌ సర్వే పూర్తి వివరాల్లేంటో ఇప్పుడు చూద్దాం..
ప్రతీ ఐదుగురిలో ఒకరికి క్రమరహిత పీరియడ్స్.. AIIMS సర్వేలో షాకింగ్ విషయాలు!

టీనేజ్ బాలికల్లో క్రమరహిత పీరియడ్స్ సమస్య ప్రమాదకరంగా పెరుగుతోందని ఎయిమ్స్ (AIIMS) సర్వే వెల్లడించింది. 2023 నుండి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన సుమారు 4,000 మంది విద్యార్థినులపై చేపట్టిన ఈ సర్వేలో.. ప్రతి ఐదుగురు అమ్మాయిలలో ఒకరు క్రమరహిత పీరియడ్స్ ఎదుర్కొంటున్నట్లు తెలిసింది.

పీరియడ్స్‌ సరిగ్గా రాకపోతే చాలామంది వెంటనే పీసీఓఎస్ (PCOS – Polycystic Ovary Syndrome) అని భయాందోళనకు గురవుతుంటారు. దీనిపై ఎయిమ్స్ పీడియాట్రిక్ ఎండోక్రినాలజీ విభాగానికి చెందిన డాక్టర్ రజినీ శర్మ మాట్లాడుతూ.. పీరియడ్స్ మొదలైన తొలి రోజుల్లో/సంవత్సరాలలో కొన్ని మార్పులు, అసమానతలు ఉండటం సాధారణం. క్రమరహిత పీరియడ్స్ ఉన్నంత మాత్రాన PCOS ఉన్నట్లు కాదు. కేవలం అల్ట్రాసౌండ్ స్కాన్ నివేదికలో పోలీసిస్టిక్ ఓవరీస్ అని వచ్చినంత మాత్రాన అది టీనేజర్లలో పీసీఓఎస్ కిందకు రాదు అని స్పష్టం చేశారు. తీవ్రమైన పింపుల్స్, ముఖం లేదా శరీరంపై అతిగా వెంట్రుకలు రావడం వంటి ఇతర లక్షణాలు కూడా ఉన్నప్పుడే వైద్యులు PCOSగా నిర్ధారిస్తారు.

ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి?

రెండు పీరియడ్స్ మధ్య వ్యవధి 21 రోజుల కంటే తక్కువగా ఉన్నప్పుడు.

లేదా రెండు పీరియడ్స్ మధ్య సమయం 35 రోజుల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు.

వరుసగా 3 నెలల పాటు పీరియడ్స్ రాకుండా ఆగిపోయినప్పుడు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.

మానసిక, శారీరక ప్రభావం:

క్రమరహిత పీరియడ్స్ లేదా PCOS సమస్యలు కేవలం మాసిక ధర్మానికే పరిమితం కాకుండా.. ఇన్సులిన్ నిరోధకత, ఊబకాయం, టైప్-2 డయాబెటిస్, ఫ్యాటీ లివర్ వంటి తీవ్రమైన మెటబాలిక్ సమస్యలకు దారితీయవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా, బరువు పెరగడం, శరీరంలో మార్పుల వల్ల టీనేజ్ అమ్మాయిలలో ఆందోళన, డిప్రెషన్, ఆత్మవిశ్వాసం తగ్గడం వంటి మానసిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి.

పరిష్కారం ఏమిటి?

చిన్న వయసులోనే అవసరం లేని మందులు వాడటం కంటే జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం. రోజువారీ వ్యాయామం, శారీరక శ్రమను అలవాటు చేసుకోవాలి. జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉంటూ.. పండ్లు, కూరగాయలు, ప్రోటీన్ ఉన్న సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. పిల్లల ఎత్తు, బరువు పెరుగుదలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యలను అరికట్టవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

⬇ Full News JPG⬇ Short News JPG
← తెల్ల వెల్లుల్లి vs నల్ల వెల్లుల్లి: తేడా ఏంటి? పరగడుపున 7 రోజులు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!Ramaprabha: ఆయన నాకు ప్రతి నెల రూ. 25 వేలు పంపుతాడు.. కానీ నేను ఫోన్ చేస్తే ఎత్తడు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com