☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

తెలంగాణ జనసేనకు ‘గడల’ బలం!

తెలంగాణలో జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు డాక్టర్ గడల శ్రీనివాసరావును రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పవన్‌ కళ్యాణ్‌ నియమించారు.
తెలంగాణ జనసేనకు ‘గడల’ బలం!
  • రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా డాక్టర్ గడల శ్రీనివాసరావు
  • తక్షణమే అమల్లోకి వచ్చేలా పవన్‌ కళ్యాణ్‌ నియామకం
  • గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ బలోపేతంపై దృష్టి
  • పరిపాలనా అనుభవం పార్టీ విస్తరణకు ఉపయోగపడుతుందని విశ్వాసం
సామాన్యుడి అస్త్రం / హైదరాబాద్ : తెలంగాణలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేసే దిశగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా డాక్టర్ గడల శ్రీనివాసరావును నియమించారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని శనివారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో వెల్లడించారు.


తెలంగాణలో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడం, నాయకులు–కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంచడం, సంస్థాగత కార్యక్రమాలను విస్తరించడం వంటి కీలక బాధ్యతలను శ్రీనివాసరావు నిర్వహించనున్నారు. పార్టీ నిర్మాణంలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించాలని జనసేన నాయకత్వం ఆశిస్తోంది.
తెలంగాణ ఆరోగ్యశాఖలో రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ హోదాలో పరిపాలనా బాధ్యతలను నిర్వహించిన డాక్టర్ గడల శ్రీనివాసరావుకు ప్రభుత్వ వ్యవస్థపై విస్తృత అనుభవం ఉంది. ఆ అనుభవం తెలంగాణలో జనసేనను రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా తీర్చిదిద్దే ప్రయత్నాలకు ఉపయోగపడుతుందని పవన్‌ కళ్యాణ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.
శ్రీనివాసరావు నియామకంతో తెలంగాణ జనసేన సంస్థాగత కార్యక్రమాలకు కొత్త ఊపు వస్తుందని, పార్టీ శ్రేణుల్లో సమన్వయం మరింత బలపడుతుందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణతోపాటు ప్రజా సమస్యలపై పోరాటాలను ఉద్ధృతం చేయడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.


⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← రేగుల కుంట శిఖంలో ఐదంతస్తులు.. క్రిమినల్‌ కేసులకు తహసీల్దార్‌ లేఖ!Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com