☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!

Chintur Agency Rains Update: పోలవరం జిల్లాలోని చింతూరు ఏజెన్సీలో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద ప్రభావం మాత్రం ఇంకా కొనసాగుతోంది. శబరి, గోదావరి నదుల్లో నీటిమట్టాలు ప్రమాదకర స్థాయిలో ఉండటంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఇళ్లు, పశువులు, పంటలకు జరిగిన నష్టాలపై 24 గంటల్లో సమగ్ర నివేదిక అందజేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. చింతూరు ఏజెన్సీలో గత కొన్ని […]
Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!

Chintur Agency Rains Update: పోలవరం జిల్లాలోని చింతూరు ఏజెన్సీలో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద ప్రభావం మాత్రం ఇంకా కొనసాగుతోంది. శబరి, గోదావరి నదుల్లో నీటిమట్టాలు ప్రమాదకర స్థాయిలో ఉండటంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఇళ్లు, పశువులు, పంటలకు జరిగిన నష్టాలపై 24 గంటల్లో సమగ్ర నివేదిక అందజేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

చింతూరు ఏజెన్సీలో గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం చింతూరు వద్ద శబరి నది నీటిమట్టం 28.5 అడుగులుగా నమోదవగా.. కూనవరం వద్ద గోదావరి నీటిమట్టం 30 అడుగులకు చేరింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పడవలో పర్యటించి బాధితులను పరామర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకుని అధికారులకు పలు సూచనలు చేశారు.

వరద బాధితులకు వెంటనే నిత్యావసర వస్తువులు అందజేసి అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. నది పరివాహక ప్రాంత ప్రజలు మరో 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. వరద ప్రభావిత గ్రామాల్లో సహాయక చర్యలను వేగవంతం చేసి బాధితులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← తెలంగాణ జనసేనకు ‘గడల’ బలం!Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com