☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Medicover Hospitals | మెడికవర్‌ ఆస్పత్రిలో వరుస మరణాల కలకలం.. రెండు రోజుల్లో 15 మంది మృత్యువాత

Medicover Hospitals | సికింద్రాబాద్‌లోని మెడికవర్‌ ఆస్పత్రిలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. ఒక్క సెప్టెంబర్‌ 22న ఏడుగురు రోగులు మృతిచెందారని, రెండు రోజుల వ్యవధిలో మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.
Medicover Hospitals | మెడికవర్‌ ఆస్పత్రిలో వరుస మరణాల కలకలం.. రెండు రోజుల్లో 15 మంది మృత్యువాత

Medicover Hospitals | సికింద్రాబాద్‌లోని మెడికవర్‌ ఆస్పత్రిలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. ఒక్క సెప్టెంబర్‌ 22న ఏడుగురు రోగులు మృతిచెందారని, రెండు రోజుల వ్యవధిలో మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

సెప్టెంబర్‌ 22న మెడికవర్‌ ఆస్పత్రిలో అక్తా తునిసా, జి. అరుణదేవి, చంద్రకళ, దుంపాల మాణిక్యమ్మ, కృష్ణ జంగయ్య, జి. మేరీ ఫాతిమా, అల్లాచెరువు వెంకటగిరి ప్రసాద్‌ అనే ఏడుగురు రోగులు మృతిచెందినట్లు సమాచారం.

ఠాగూర్ సినిమా తరహాలో భారీగా వసూళ్లు?

ఠాగూర్ సినిమా తరహాలో అక్తా తునిసా అనే రోగికి సెప్టెంబర్‌ 21న బ్రెయిన్‌ డెడ్‌ అయినప్పటికీ.. చికిత్స పేరుతో ఆమె కుటుంబం నుంచి రూ.10 లక్షలు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆమె మృతిచెందినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారని పేర్కొంటున్నారు. చికిత్సకు తొలుత రూ.10 లక్షల ప్యాకేజీ మాట్లాడుకుని.. ఆ తర్వాత రూ.30 లక్షలు చెల్లిస్తేనే డిశ్చార్జ్‌ చేస్తామని చెప్పినట్లు మరికొందరు ఆరోపిస్తున్నారు.

ఈ వ్యవహారంపై రోగుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చినవారి నుంచి భారీగా నగదు వసూలు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. వరుస మరణాలు, చికిత్సకు సంబంధించిన వసూళ్లపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Drishyam 3 | బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ ‘దృశ్యం 3’ సంచలనం.. తొలిరోజే రికార్డు వసూళ్లు!The Red Bag | తొలి ప్రయత్నంతోనే టాలీవుడ్‌లో సరికొత్త సంచలనం సృష్టించిన ‘ది రెడ్ బ్యాగ్’ దర్శకుడు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com