☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

300కోట్ల క్లబ్లోకి ‘జైలర్-2’.. ‘రణబాలి’కి ఎంతంటే?

Jailer 2 & Raanabali : తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘జైలర్-2’ థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నెల...
300కోట్ల క్లబ్లోకి ‘జైలర్-2’.. ‘రణబాలి’కి ఎంతంటే?

Jailer 2 & Raanabali : తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘జైలర్-2’ థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నెల 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రముఖ ట్రేడ్ విశ్లేషణ సంస్థ Sacnilk నివేదిక ప్రకారం.. ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 317.15 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. కేవలం శనివారం ఒక్కరోజే భారతదేశంలో రూ.47.80 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టడం రజినీకాంత్ క్రేజ్‌కు ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. అభిమానుల అపూర్వ ఆదరణతో ఈ చిత్రం అన్ని ప్రాంతాల్లోనూ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోంది.

Read Also : షారుఖ్ అంటే పిచ్చి ప్రేమ అంటున్న మృణాల్

రేసులో ‘రణబాలి’.. బాక్సాఫీస్ వద్ద విజయ్-రష్మిక చిత్ర పరిస్థితి ఇదీ!

మరోవైపు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రణబాలి’ చిత్రం కూడా థియేటర్లలో తన వసూళ్ల ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్ల లెక్కల ప్రకారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.26.65 కోట్ల గ్రాస్ నమోదు చేసింది. ఇక కేవలం భారతదేశం వరకు చూస్తే రూ.16.55 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘జైలర్-2’ తుఫాన్ పోటీని తట్టుకుంటూ ‘రణబాలి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ మేర స్థిరమైన వసూళ్లను రాబడుతుందో వేచి చూడాల్సి ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← పుంగనూరు ఘటన.. మిథున్ రెడ్డిపై నాలుగు కేసులు నమోదుఆలయంలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. 12 మంది భక్తులు మృతి! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com