☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

50 వేల మంది పెన్షనర్లకు త్వరలోనే హెల్త్ కార్డులు.. సీఈఓ కీలక ప్రకటన!

NEHS Trust CEO: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్ కార్డులు త్వరగా అందించేలా చర్యలు చేపట్టినట్లు నేషనల్ ఎంప్లాయ్ హెల్త్...
50 వేల మంది పెన్షనర్లకు త్వరలోనే హెల్త్ కార్డులు.. సీఈఓ కీలక ప్రకటన!

NEHS Trust CEO: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్ కార్డులు త్వరగా అందించేలా చర్యలు చేపట్టినట్లు నేషనల్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ (ఎన్ఈహెచ్ఎస్) ట్రస్ట్ సీఈఓ హన్మంత్ తెలిపారు. మంగళవారం బడీచౌడిలోని పెన్షన్ ఆఫీసును ఆయన సందర్శించి హెల్త్ కార్డుల డౌన్‌లోడ్, అప్‌లోడ్ ప్రక్రియను పరిశీలించారు.

Read Also : Telangana March: తెలంగాణ మార్చ్‌కు 14 ఏళ్లు.. ‘సాగరహారం’ నాటి ఉద్యమ జ్ఞాపకాలు

NEHS Trust CEO
Health cards for 50,000 pensioners soon… CEO’s key announcement!

NEHS Trust CEO: 50 వేల మంది పెన్షనర్లకు త్వరలోనే కార్డులు

ఈ మూడు జిల్లాల్లో దాదాపు 90 వేల మంది పెన్షనర్లు ఉండగా.. ఇప్పటివరకు సుమారు 40 వేల మందికి మాత్రమే హెల్త్ కార్డులు అందాయి. ఇంకా 50 వేల మంది కార్డులు పొందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అర్హులైన పెన్షనర్లందరికీ త్వరగా కార్డులు అందించేందుకు బడీచౌడి పెన్షన్ ఆఫీసులో ఫైనాన్స్, ట్రెజరీ ఐఎఫ్‌ఎంఎస్, హెల్త్ టెక్నికల్ టీమ్‌లు కలిసి కార్డుల అప్‌లోడ్, డౌన్‌లోడ్ ప్రక్రియను చేపట్టాయి. అనంతరం సీఈఓ హన్మంత్ చేతుల మీదుగా సుమారు 500 మంది పెన్షనర్లకు హెల్త్ కార్డులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి. వెంకట్ రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు టి. రంగయ్య, ప్రధాన కార్యదర్శి కె. వెంకయ్య, ఫైనాన్స్ సెక్రటరీ ప్రహ్లాద్ రావు, వెంకట్ రెడ్డి, లక్ష్మీనర్సింహారావు, శ్యామ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← APPSC OTPR అప్డేట్ నేటి నుంచేఎన్నికల ప్రక్రియ పూర్తయిన రాష్ట్రాల్లో ఫారం-6 నుంచి ‘SIR’ డిక్లరేషన్ తొలగించిన ఈసీ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com