☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Ganesh laddu | ఖమ్మంలో వెల్లివిరిసిన మతసామరస్యం..! గణేష్ లడ్డు సొంతం చేసుకున్న ముస్లిం నేత

Ganesh laddu | ఖమ్మం జిల్లాలో మతసామరస్యం వెల్లివిరిసింది. భక్తికి మతాలు అడ్డుకావని, ఇందూ, ముస్లిం భాయి భాయి అని ఓ ముస్లిం సోదరుడు నిరూపించాడు.
Ganesh laddu | ఖమ్మంలో వెల్లివిరిసిన మతసామరస్యం..! గణేష్ లడ్డు సొంతం చేసుకున్న ముస్లిం నేత

ఖమ్మం రూరల్: ఖమ్మం జిల్లాలో మతసామరస్యం వెల్లివిరిసింది. భక్తికి మతాలు అడ్డుకావని, ఇందూ, ముస్లిం భాయి భాయి అని ఓ ముస్లిం సోదరుడు నిరూపించాడు. వివరాల్లోకి వెళ్తే..ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డు శ్రీరాంనగర్లో ని గణేష్ మండపం వద్ద జరిగిన వేలంపాటలో వినాయకుడి లడ్డు(Ganesh laddu) రూ.60, 500 ధర పలికింది. గణేష్ నిమజ్జనానికి ఒక రోజు ముందుగా మంగళవారం రాత్రి మండపం వద్ద నిర్వాహకులు లడ్డూ వేలం నిర్వహించారు. వేలంపాటలో పలువురు కాలనీవాసులు లడ్డును దక్కించుకునేందుకు పోటీపడ్డారు. చివరకు ముస్లిం మైనార్టీ నేత( Muslim leader) షేక్ హుస్సేన్ రూ.60, 500 కు సొంతం చేసుకోవడం విశేషం.

దీంతో నవరాత్రి వేడుకలు మతసామరస్యనికి సాక్షిగా నిలిచింది. ముస్లిం మతానికి చెందిన హుస్సేన్ అంత ధర పెట్టి లడ్డును సొంతం చేసుకోవడం పట్ల కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. లడ్డు సొంతం చేసుకున్న హుస్సేన్ గత కొద్ది సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో కుల మతాలకు అతీతంగా పలు పండుగలు, శుభ కార్యాలయాల్లో పాల్గొంటూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ క్రమంలోనే గణేష్ లడ్డు సొంతం చేసుకోవడం పట్ల హుస్సేన్ కు సబ్బండా వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Actor Nani | నిజమైన రివ్యూలకు ఎలాంటి ఇబ్బంది లేదు.. ‘ది ప్యారడైజ్’ వివాదంపై క్లారిటీ ఇచ్చిన నానిHarish Rao | హరీశ్‌ రావు వస్తున్నారని తెలిసి కల్వకుర్తి ఎత్తిపోతల మోటర్లను ఆన్ చేసిన రేవంత్ సర్కార్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com