☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

బెజవాడ పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్.. ఏబీవీకి ఎన్నారైల మద్దతు..!

విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ పీఠం కోసం జరగబోయే ఎన్నికలు ముక్కోణపు పోరుతో అత్యంత ఉత్కంఠభరితంగా మారాయి. కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ, వైసీపీ తరఫున రాయన భాగ్యలక్ష్మి బరిలో నిలవగా.. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థిగా ఎంట్రీ ఇచ్చి సమీకరణాలను పూర్తిగా మార్చేశారు. గతంలో విజయవాడ పోలీసు కమిషనర్‌గా పనిచేసిన ఏబీవీకి కాంగ్రెస్, వామపక్షాలు బహిరంగంగా మద్దతు ప్రకటించాయి. అయితే, ఈ ఎన్నికల వెనుక సోషల్ మీడియా వేదికగా […] The post బెజవాడ పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్.. ఏబీవీకి ఎన్నారైల మద్దతు..! appeared first on Telugu Rajyam.
బెజవాడ పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్.. ఏబీవీకి ఎన్నారైల మద్దతు..!

విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ పీఠం కోసం జరగబోయే ఎన్నికలు ముక్కోణపు పోరుతో అత్యంత ఉత్కంఠభరితంగా మారాయి. కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ, వైసీపీ తరఫున రాయన భాగ్యలక్ష్మి బరిలో నిలవగా.. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థిగా ఎంట్రీ ఇచ్చి సమీకరణాలను పూర్తిగా మార్చేశారు. గతంలో విజయవాడ పోలీసు కమిషనర్‌గా పనిచేసిన ఏబీవీకి కాంగ్రెస్, వామపక్షాలు బహిరంగంగా మద్దతు ప్రకటించాయి.

అయితే, ఈ ఎన్నికల వెనుక సోషల్ మీడియా వేదికగా ఒక పెద్ద పొలిటికల్ గేమ్ నడుస్తోందని క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. కూటమి తరఫున సీటు జనసేనకు వెళ్లడం, అందులోనూ వంగవీటి రాధాకు అభ్యర్థిత్వం దక్కడం తెలుగుదేశం పార్టీలోని ఒక బలమైన అసంతృప్త వర్గానికి ఏమాత్రం మింగుడుపడటం లేదు. రాధాకు నేరుగా సహకరిస్తే తమ రాజకీయ భవిష్యత్తు ఎక్కడ దెబ్బతింటుందోననే ఆందోళనతో, టీడీపీలోని ఆ అంతర్గత వర్గం ఒక వ్యూహాత్మక అడుగు వేసింది.

వంగవీటి రాధాను బహిరంగంగా ఎక్కడా విమర్శించకుండా, ఆయన అభిమానుల ఆగ్రహానికి గురికాకుండా జాగ్రత్తపడుతూనే.. స్వతంత్ర అభ్యర్థి ఏబీవీని గెలిపించాలంటూ సోషల్ మీడియాలో ఒక వర్గం తెరవెనుక ప్రచారాన్ని తీవ్రం చేసింది. ఈ అంతర్గత ఆపరేషన్‌లో విదేశాల్లో ఉన్న కొందరు ఎన్నారైలు, ఐటీ విభాగం ప్రతినిధులు అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. బెజవాడ అభివృద్ధి చెందాలంటే ఒక సమర్థుడైన, చదువుకున్న మాజీ అధికారి చేతిలో నగర పగ్గాలు ఉండాలంటూ వారు చేస్తున్న పాజిటివ్ క్యాంపెయిన్ వెనుక.. కూటమి ఓట్లను, ముఖ్యంగా టీడీపీ క్యాడర్ ఓట్లను ఏబీవీ వైపు మళ్లించే పెద్ద స్కెచ్ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాధాకు సీటు ఇవ్వడం ఇష్టం లేని టీడీపీ అసంతృప్త నేతలే ఏబీవీని రంగంలోకి దించారని, ఈ ఓట్ల చీలిక అంతిమంగా ఎవరికి నష్టం చేకూరుస్తుందనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

The post బెజవాడ పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్.. ఏబీవీకి ఎన్నారైల మద్దతు..! appeared first on Telugu Rajyam.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← వైసీపీకి నయా జోష్.. స్పీడ్ పెంచిన మాజీ ఎమ్మెల్యేలు..!సీఎం చంద్రబాబు ఒంటరిగా పవన్..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com