☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఆసియా క్రీడల్లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన పీవీ సింధు

PV Sindhu: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆసియా క్రీడల్లో తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తోంది. మహిళల సింగిల్స్ విభాగంలో జరిగిన హోరాహోరీ పోరులో ఆమె...
ఆసియా క్రీడల్లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన పీవీ సింధు

PV Sindhu: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆసియా క్రీడల్లో తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తోంది. మహిళల సింగిల్స్ విభాగంలో జరిగిన హోరాహోరీ పోరులో ఆమె అరివీర భీకర ప్రదర్శన కనబరిచి క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. జపాన్‌కు చెందిన బలమైన క్రీడాకారిణి టొమోకా మియాజాకితో జరిగిన మ్యాచ్‌లో సింధు పూర్తి ఆధిపత్యం చెలలాయించి, 21-9, 21-13 తేడాతో స్ట్రెయిట్ గేమ్‌లలో సులువుగా విజయం సాధించింది.

దూకుడు ప్రదర్శించిన తెలుగు తేజం

మ్యాచ్ ప్రారంభం నుంచే సింధు ఎంతో దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. తొలి గేమ్‌లో జపాన్ షట్లర్‌కు ఎలాంటి అవకాశమూ ఇవ్వకుండా ఏకపక్షంగా 21-9 తేడాతో కైవసం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లో మియాజాకి కాస్త ప్రతిఘటించేందుకు ప్రయత్నించినప్పటికీ, సింధు తన అద్భుతమైన అనుభవంతో సుదీర్ఘ ర్యాలీలను అధిగమించింది. విరామ సమయానికి ఆధిక్యంలో నిలిచిన సింధు, అదే జోరును ముగింపు వరకు కొనసాగించి 21-13తో మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకుంది.

Read also: Virat Kohli: 2027 వరల్డ్‌కప్‌ ఆడతా.. కోహ్లీ క్లారిటీ

PV Sindhu: ఒకే రోజు రెండు విజయాలు నమోదు

ఈ మ్యాచ్‌కు ముందు అదే రోజు ఉదయం జరిగిన రెండో రౌండ్ పోరులోనూ సింధు అద్భుత ప్రతిభ కనబరిచింది. చైనీస్ తైపీ క్రీడాకారిణి చియు పిన్-చియాన్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో 21-19, 21-14 తేడాతో విజయం సాధించి ముందంజ వేసింది.

పతకం లక్ష్యంగా పట్టుదల

గత హ్యాంగ్జౌ క్రీడలలో క్వార్టర్ ఫైనల్ దశలోనే నిష్క్రమించిన సింధు, ఈసారి ఎలాగైనా పతకం సాధించాలనే బలమైన పట్టుదలతో బరిలోకి దిగింది. ఇప్పటికే ఆసియా క్రీడల చరిత్రలో పతకాలు సాధించిన ఆమె, తాజా విజయాల జోరుతో దేశానికి మరో పతకాన్ని అందించే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఏఐతో 100 కోట్ల మంది ప్రాణాలకు ముప్పు: బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు‘ది ప్యారడైజ్’ సినిమా చూసిన కేటీఆర్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com