☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

62 ఏళ్ల వయసులో సీక్రెట్‌గా గోవింద రెండో పెళ్లి? మోసగాళ్లు అంటూ భార్య సునీత ఎమోషనల్ కామెంట్స్!

62 ఏళ్ల వయసులో సీక్రెట్‌గా గోవింద రెండో పెళ్లి? మోసగాళ్లు అంటూ భార్య సునీత ఎమోషనల్ కామెంట్స్!
62 ఏళ్ల వయసులో సీక్రెట్‌గా గోవింద రెండో పెళ్లి? మోసగాళ్లు అంటూ భార్య సునీత ఎమోషనల్ కామెంట్స్!
62 ఏళ్ల వయసులో సీక్రెట్‌గా గోవింద రెండో పెళ్లి? మోసగాళ్లు అంటూ భార్య సునీత ఎమోషనల్ కామెంట్స్!

బాలీవుడ్ స్టార్ హీరో గోవింద ( 62 ) వ్యక్తిగత జీవితం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. తన భార్య సునీత అహుజాతో విభేదాలు నడుస్తున్న వేళ.. నటి కోమల్ రాణి స్వర్ణకర్ తో కలిసి లాల్‌బాగ్చా రాజా గణపతి దర్శించుకోవడం చర్చనీయాంశమైంది. అంతే కాకుండా అక్కడ జరిగిన పరిణామాలు ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ముంబైలోని ప్రసిద్ధ లాల్‌బాగ్చా రాజా మండపంలో మంగళవారం (సెప్టెంబర్ 22, 2026) గోవింద తెల్లటి కుర్తా-పైజామాలో, కోమల్ ఎరుపు రంగు సాంప్రదాయ చీరకట్టులో మెరిసారు. గణపయ్య దర్శనం అనంతరం బయటకు వచ్చిన సమయంలో కోమల్ నుదుటన 'సింధూరం' (పాపట బొట్టు) కనిపించడంతో సినీ వర్గాలతో పాటు ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

దీంతో కోమల్ రాణిని గోవింద రహస్యంగా పెళ్లి చేసుకున్నారా? అనే ప్రచారం ఊపందుకుంది. అయితే, గణపతి పాదాల వద్ద నమస్కరించే సమయంలో అక్కడ ఉన్న కుంకుమ కోమల్ నుదుటికి అంటుకుందని, వారికి ఎలాంటి పెళ్లి జరగలేదని మరో వైపు చర్చనడుస్తోంది.

ఇదిలా ఉంటే.. గోవింద రాకకంటే కొద్ది గంటల ముందే ఆయన భార్య సునీత అహుజా ఒంటరిగా వచ్చి గణపతిని దర్శించుకున్నారు. అనంతరం ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంట పడిన సునీత.. "మనుషుల కంటే జంతువులను ప్రేమించడమే నయం. మనుషులు ఎప్పుడూ మోసగాళ్లే (ధోకేబాజ్)" అంటూ చేసిన పరోక్ష వ్యాఖ్యలు నెట్టింట సంచలనంగా మారాయి.

గతంలోనే గోవింద-కోమల్‌ల బంధంపై బహిరంగంగా సునీత విమర్శలు గుప్పించారు. అంతే కాదు కొద్ది నెలల కిందట ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేసిన డివోర్స్ పిటిషన్‌ను ఇటీవలే ఉపసంహరించుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ 'లాల్‌బాగ్చా రాజా దర్శనం- - సింధూరం' ఎపిసోడ్‌తో ముంబై సినీ వర్గాల్లో గోవింద వైవాహిక బంధం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

View this post on Instagram

html, body,
⬇ Full News JPG⬇ Short News JPG
← సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.28.94 కోట్లు..Nani Court Order: ‘ది ప్యారడైజ్’ కోర్టు ఆర్డర్‌పై నాని క్లారిటీ.. నెగటివ్ రివ్యూలు ఇస్తే జైలుకేనా? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com