☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Suresh: ఇప్పుడున్న హీరోలలో అతడు కారణజన్ముడు.. సెట్ లో అతడిని అలా చూసి ఆశ్చర్యపోయా.. నటుడు సురేష్..

సీనియర్ నటుడు సురేష్ జూనియర్ ఎన్టీఆర్ నటనపై తన ప్రశంసలు కురిపించారు. నాగ సినిమా షూటింగ్‌లో ఎన్టీఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని, భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతాడని తాను అంచనా వేశానని సురేష్ తెలిపారు. చిరంజీవి కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని, పవన్ కళ్యాణ్ తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయికి నిర్మాతగా వ్యవహరించిన వైనాన్ని కూడా పంచుకున్నారు.
Suresh: ఇప్పుడున్న హీరోలలో అతడు కారణజన్ముడు.. సెట్ లో అతడిని అలా చూసి ఆశ్చర్యపోయా.. నటుడు సురేష్..

సీనియర్ నటుడు సురేష్ ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన నటన, సినీ పరిశ్రమలోని ప్రముఖులతో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఎన్టీఆర్‌ను సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని అన్నారు. ఇది పూర్తిగా నిజమని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్‌తో కలిసి నాగ సినిమాలో నటించినప్పటి అనుభవాలను సురేష్ గుర్తు చేసుకున్నారు. ఆ సినిమాలో తను తండ్రిగా, ఎన్టీఆర్ కొడుకుగా నటించారని, ఒక కీలక సన్నివేశంలో ఎన్టీఆర్ నటన తనను ఎంతగానో ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. “కాలేజీ నుండి కొట్టి ఇంటికి వచ్చిన కొడుకును ప్రశ్నించే సన్నివేశం అది. మానిటర్లో ఎన్టీఆర్ నటనను చూసి ఆశ్చర్యపోయాను. ఆ వయసులో ఈ కుర్రాడికి ఇంత మెచ్యూరిటీ యాక్టింగ్ ఎలా?” అని ఆయన అప్పట్లో విస్మయం వ్యక్తం చేశారు. ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు తన కళ్ళు చెమర్చాయని, ఎన్టీఆర్ భవిష్యత్తులో చాలా పెద్ద స్టార్ అవుతాడని అప్పుడే డైరెక్టర్ సురేష్ కృష్ణ గారికి తాను చెప్పినట్లు, ఆ రోజు చెప్పిన మాట ఈ రోజు నిజమైందని సురేష్ సంతోషం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిని దాటి ఇంటర్నేషనల్ లెవెల్‌లో కూడా రాణిస్తాడని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటన గురించి సురేష్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. పులితో చేసిన పోరాట దృశ్యంలో ఎన్టీఆర్ కళ్ళల్లోని భావాలను రాజమౌళి గొప్పగా పండించారని, దానికి మూలం ఎన్టీఆర్ యొక్క అసాధారణ నటన అని సురేష్ అన్నారు. మెగాస్టార్ చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని కూడా సురేష్ ఈ సందర్భంగా పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా లవ్ స్టోరీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగులో పెద్ద డిజాస్టర్..

చిరంజీవితో కలిసి ప్రాణం ఖరీదు వంటి సినిమాలలో చిన్న పాత్రలు చేశానని, ఆ తర్వాత మరో సినిమాలో కూడా నటించానని తెలిపారు. చిరంజీవి గారితో తనకు మంచి అనుబంధం ఉందని, వారింటికి తాను తరచు వెళ్తూ ఉండేవారని పేర్కొన్నారు. చిరంజీవి కుటుంబం తనను చాలా బాగా చూసుకునేదని చెప్పారు. రామ్ చరణ్ నటించిన ఒకటి రెండు సినిమాలలో కూడా తాను చేశానని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

ఎన్టీఆర్..

Ntr

Ntr

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← అక్టోబర్ నెలలో అదృష్టం కలిసి వచ్చే ఐదు రాశులు ఇవేAkshay Kumar’s son Aarav makes rare appearance at airport →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com