☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

పవన్ కళ్యాణ్ నటించిన బై బై బంగారు రమణమ్మ పాట అంటే నాకు పిచ్చి ఇష్టం.. టాలీవుడ్ హీరోయిన్..

పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టమైన "బై బై బంగారు రమణమ్మ" పాట అంటే తనకు పిచ్చి అని అన్నారు టాలీవుడ్ హీరోయిన్. ఇటీవల తాను నటించిన సినిమా ప్రమోషనల్లో భాగంగా ఉత్తరాంధ్ర యాసతో పాడిన పాటల సవాళ్లను ఎదుర్కొన్నారు. దర్శకుడు గౌరి నాయుడు అంకితభావం, జానపద గాయని ఉష కష్టపడి పైకొచ్చిన స్ఫూర్తిదాయక ప్రయాణం గురించి చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ నటించిన బై బై బంగారు రమణమ్మ పాట అంటే నాకు పిచ్చి ఇష్టం.. టాలీవుడ్ హీరోయిన్..

గరివిడి లక్ష్మి సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతుంది హీరోయిన్ ఆనంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషనల్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో ఎదుర్కొన్న సవాళ్లు ఆసక్తికరంగా ఉన్నాయి. వరంగల్ ప్రాంతానికి చెందిన ఆనంది, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వంటి ఉత్తరాంధ్ర యాసలో పాటలు పాడాల్సి వచ్చింది. “ఈ యాసను పట్టుకోవడానికి, అందులో పాటలు పాడి లిప్ సింక్ చేయడానికి చాలా కష్టపడ్డాను” అని ఆనంది పేర్కొన్నారు. యాసలో లోపం లేకుండా పర్ఫెక్షన్‌గా చేయాలని దర్శకుడు గౌరి నాయుడు పట్టుదలతో ఉండేవారని, ఏమాత్రం తప్పు జరిగినా మళ్లీ చేయించేవారని ఆమె వివరించారు. బుర్రకథ శైలిని అలవర్చుకోవడం, ప్రతి డైలాగులోనూ యాసను పర్ఫెక్ట్‌గా పలకడం ఆమెకు ఒక పెద్ద చాలెంజ్ అని చెప్పుకొచ్చారు. గౌరి నాయుడుతో కూడిన వర్క్‌షాప్‌లు, ఆయన మార్గదర్శకత్వంలోనే ఈ సవాళ్లను అధిగమించానని ఆమె తెలిపారు. ముఖ్యంగా తనకు పవన్ కళ్యాణ్ నటించిన బైబై రమణమ్మ సాంగ్ తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు.

దర్శకుడు గౌరి నాయుడు అంకితభావం అసాధారణం. షూటింగ్‌లో ఏమాత్రం రాజీ పడకుండా, ప్రతి చిన్న వివరాలపై దృష్టి సారించేవారని ఆనంది తెలిపారు. ఉదాహరణకు, గాయకులు పాటలు పాడేటప్పుడు గాజుల శబ్దం మైక్‌లో పడకుండా వాటికి రిబ్బన్లు కట్టించడం, లేదా దారాలు చుట్టించడం వంటి ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారట. డబ్బింగ్‌లో మార్పులు చేసుకోకుండా, షూటింగ్‌లో ఎలా చేశారో, అలాగే డబ్బింగ్‌లో కూడా పర్ఫెక్ట్‌గా ఉండాలని పట్టుబట్టేవారని ఆనంది పేర్కొన్నారు. గరివిడి లక్ష్మి సినిమా ఉత్తరాంధ్ర భాషను, సంస్కృతిని పర్ఫెక్ట్‌గా చూపించిందని, దీనికి గౌరి నాయుడు దార్శనికతే కారణమని ఆమె ప్రశంసించారు.

ఈ వీడియోలో జానపద గాయని ఉష ప్రయాణం ఒక గొప్ప స్ఫూర్తిని నింపింది. ఒకప్పుడు స్టూడియోకి ఆటోలో వచ్చి, కష్టపడి పాటలు పాడుతూ నెమ్మదిగా యూట్యూబ్‌లో పైకి వచ్చిన ఉష కథను వివరించారు. ఆమె కష్టానికి, ప్రతిభకు దక్కిన ఫలితం ఏమిటంటే, ఒక సంవత్సరం క్రితం ఆటోలో ప్రయాణించిన ఆమె, నేడు డ్రైవర్ ఉన్న కారులో వస్తున్నారని, ఇది ఆమె జీవితంలో సాధించిన గొప్ప విజయం అని వక్త సంతోషం వ్యక్తం చేశారు. ఉష పాటలు కోట్లలో వ్యూస్ సాధించి, మిలియన్ల మంది ప్రేక్షకులను అలరించాయని ఆయన పేర్కొన్నారు. “మట్టి బిడ్డ కష్టపడి ఎదిగింది, కష్టపడి సాధించింది” అంటూ ఆమె ప్రయాణాన్ని ప్రశంసించారు. కనకవ్వ వంటి ఇతర జానపద కళాకారుల గురించి కూడా చెప్పుకొచ్చారు.

ఎక్కువమంది చదివినవి: Nana Patekar : నా ఆస్తి ఆ 12 ఎండు కట్టలే.. నేను ముందే పక్కన పెట్టుకున్నా.. నానా పటేకర్ వీడియో షేర్ చేసిన ఆర్జీవీ..

హీరోయిన్ ఆనంది..

View this post on Instagram

ఎక్కువమంది చదివినవి: Srikanth: ఆ హీరోయిన్ నాకు చాలా స్పెషల్ పర్సన్.. నటనలో మా ఇద్దరికీ పోటీ ఉండేది.. హీరో శ్రీకాంత్..

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← పిల్లలు ఇష్టంగా తినే కమ్మనైన కొబ్బరిపాల చికెన్ కర్రీ.. పాతకాలం నాటి స్టైల్‌లో ముక్క మెత్తగా..మరో 20 రోజులు వీరికి తిరుగే ఉండదు.. ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com