☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

డ్యూటీ ముగించుకుని వస్తుండగా కారు ఢీ.. ఆర్ఎస్ఐ యాక్సిడెంట్‌లో వెలుగులోకి సంచలన ట్విస్ట్!

ఆదిలాబాద్ యాపల్ గూడ బెటాలియన్ లో ఆర్ఎస్ఐ రాకేష్ కారు ప్రమాదం వెనుక సంచలన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇది ప్రమాదం కాదని, అవినీతిని బయటపెట్టినందుకు ఆర్ఐ నరేష్ హత్యాయత్నం చేశారని రాకేష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నరేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పూర్తిస్థాయి విచారణకు డిమాండ్ చేస్తున్నారు.
డ్యూటీ ముగించుకుని వస్తుండగా కారు ఢీ.. ఆర్ఎస్ఐ యాక్సిడెంట్‌లో వెలుగులోకి సంచలన ట్విస్ట్!

ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలం యాపల్ గూడ పోలీస్ బెటాలియన్ వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం హత్యాయత్నం అని తేలింది. యాపల్‌గూడ బెటాలియన్‌లో ఆర్ఎస్ఐగా పని చేస్తున్న రాకేష్ బైక్‌ను.. అదే బెటాలియన్‌లో ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న నరేష్ కారుతో ఢీకొట్టాడు. అయితే ఈ ఘటన ప్రమాదం కాదని.. ముందస్తు ప్లాన్ ప్రకారమే ఆర్ఐ నరేష్.. ఆర్ఎస్ఐ రాకేష్ ను హత్య చేయాలని ఫ్లాన్ చేశారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా ఆదిలాబాద్ యాపల్ గూడా బెటాలియన్లు జరుగుతున్న అవినీతి అక్రమాలు బయటకు రావడానికి రాకేష్ కారణమని.. నిజాలు బయటపెడుతున్నాడని రాకేష్ పై ఆర్ఐ నరేష్ హత్యాయత్నం చేసినట్టు రాకేష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డ్యూటీ ముగించుకుని తిరిగి బెటాలియన్ కు వెళుతుండగా పోలీసు వాహనంతో బెటాలియన్ రిజర్వ్ సిఐ నరేష్ కారుతో డీకొట్టి యాక్సిడెంట్ చేశారని ఆరోపిస్తున్నారు రాకేష్ కుటుంబ సభ్యులు.

ఇటీవల యాపల్ గూడ బెటాలియన్ లో జరిగిన అవకతవలపై 12పేజీలు లేఖను ఉన్నతాధికారులకు గుర్తు తెలియని వ్యక్తులు అందించగా.. ఆ వివరాలను ఆర్ఎస్‌ఐ రాకేష్ బయటకు లీక్ చేశారని కుట్రతో హత్యాయత్నానికి పూనుకున్నారని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు రాకేష్ కుటుంబ సభ్యులు. తీవ్ర గాయాలపాలైన ఆర్ఎస్ఐ రాకేష్ ను చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్ అసుపత్రికి తరలించారు. బాధితుడు రాకేష్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఆదిలాబాద్ రూరల్ పోలీసులు బెటాలియన్ ఆర్ఐ నరేష్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← పసుపు ఐస్ క్యూబ్స్‌తో మెరిసే చర్మం..ఇలా తయారు చేసుకుని వాడారంటే మెరిసిపోతారు!హీరోయిన్‌ను బీట్ చేసేలా ఉందిగా..! ప్యారడైజ్‌లో నాని యంగ్ మదర్‌గా కనిపించిన టాలెంటెడ్ బ్యూటీ ఎవరంటే →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com