☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

జహీరాబాద్ మండలంలో కెమికల్ భూతం.. ! ఎన్జీటీ మెట్లెక్కిన బాధితులు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో కెమికల్ భూతం స్వైరవిహారం చేస్తోంది. బుర్ధిపాడ్, కొత్తూరు-బి శివారులో వెలసిన వైజయంతి కెమికల్ ల్యాబ్ ఫ్యాక్టరీ నాలుగు గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
జహీరాబాద్ మండలంలో కెమికల్ భూతం.. ! ఎన్జీటీ మెట్లెక్కిన బాధితులు

జహీరాబాద్, సెప్టెంబర్ 23 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో కెమికల్ భూతం స్వైరవిహారం చేస్తోంది. బుర్ధిపాడ్, కొత్తూరు-బి శివారులో వెలసిన వైజయంతి కెమికల్ ల్యాబ్ ఫ్యాక్టరీ నాలుగు గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే విషపు పొగ, వ్యర్థ జలాలతో గ్రామాలు విలవిలలాడుతున్నాయి. బుర్ధిపాడ్, కొత్తూరు-బి, తుంకుంట, దిడికి గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ‘‘పగలు బాగానే ఉంటుంది.. కానీ చీకటి పడగానే ఫ్యాక్టరీ నుంచి ఘాటైన వాసనతో పొగ వదులుతున్నారు. పిల్లలు, పెద్దలు ఊపిరి పీల్చలేకపోతున్నారు’’ అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాదు, ఫ్యాక్టరీ వ్యర్థాలను గుట్టుచప్పుడు కాకుండా బయటకు వదులుతున్నారని, ముఖ్యంగా వర్షం పడ్డప్పుడే వాగులు, వంకల్లోకి వదిలేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. దీంతో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమవుతున్నాయని, బోర్ల నీళ్లు తాగడానికి కూడా పనికిరావడం లేదని, పంట పొలాలు చౌడు బారిపోతున్నాయని వాపోతున్నారు. అసలు రెడ్ జోన్‌లో ఉండాల్సిన ఈ ప్రమాదకర ఫ్యాక్టరీని అటవీ ప్రాంతానికి ఆనుకుని, పచ్చని పొలాల మధ్య ఎలా అనుమతించారని ప్రశ్నిస్తున్నారు.
దీని వల్ల అటవీ ప్రాంతంలోని పక్షులు, జంతువులకు, కొత్తూర్ శివారులోని నారింజ ప్రాజెక్టు జలాలకు కూడా తీవ్ర ముప్పు పొంచి ఉందని ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో విసిగిపోయిన గ్రామస్తులు చివరకు జాతీయ హరిత ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. ఈనెల 22న ఎన్జీటీ సదరన్ జోన్, చెన్నైలో ఫిర్యాదు చేయగా, ట్రిబ్యునల్ OA/135(SZ)/2026 గా కేసు నమోదు చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలితో సహా 11 మందిని ప్రతివాదులుగా చేర్చింది. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారని, ఈ విష ఫ్యాక్టరీని తమ గ్రామాల నుంచి తరలించే వరకు పోరాటం ఆగదని బాధిత గ్రామాల ప్రజలు స్పష్టం చేస్తున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← SriLanka Court | శ్రీలంకలో ఈస్ట‌ర్ బాంబింగ్స్ కేసు.. 15 మందికి 200 ఏళ్లకుపైగా జైలు శిక్ష..!Vande Mataram | మనస్సాక్షికి వ్యతిరేకంగా వందేమాతరం పాడలేమన్న వారిని శిక్షించలేం: సుప్రీంకోర్టు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com