☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

Bhale Bhale Magadivoy: భలే భలే మగాడివోయ్ సినిమాను నేను రిజెక్ట్ చేయలేదు.. క్లారిటీ ఇచ్చిన టాలీవుడ్ హీరో..

టాలీవుడ్ హీరో తన కెరీర్, భలే భలే మగాడివోయ్ సినిమాపై ఉన్న అపోహ, రీమేక్ చిత్రాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. 7/G బృందావన్ కాలనీ సినిమా చేయలేకపోయినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తన డైలీ రొటీన్, ఆహారపు అలవాట్లు, అలాగే కొత్త సినిమా హీరోయిన్లు పనితీరు గురించి వివరించారు.
Bhale Bhale Magadivoy: భలే భలే మగాడివోయ్ సినిమాను నేను రిజెక్ట్ చేయలేదు.. క్లారిటీ ఇచ్చిన టాలీవుడ్ హీరో..

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అల్లరి నరేష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. “భలే భలే మగాడివోయ్” చిత్రంపై ఉన్న అపోహలను నివృత్తి చేయడం నుండి తన ఆహారపు అలవాట్ల వరకు అనేక అంశాలపై ఆయన మాట్లాడారు. నరేష్ అనేక చిత్రాలు చూస్తానని, కొన్ని బాగుంటాయని అనిపించినా, అన్నింటినీ రీమేక్ చేయాలనే ఆలోచన రాలేదని తెలిపారు. అయితే, “సుడిగాడు” చిత్రం స్పూఫ్ కామెడీగా బాగా వర్కవుట్ అవుతుందని అప్పుడే అనిపించిందని గుర్తు చేసుకున్నారు. తాను చేయలేకపోయిన ఒక సినిమా కోసం చాలా బాధపడ్డానని, అది “7/G బృందావన్ కాలనీ” అని వెల్లడించారు. దర్శకుడు సెల్వరాఘవన్ తనకు మంచి స్నేహితుడని, మొదట ఈ కథను తన కోసమే అనుకున్నారని, కానీ తర్వాత అది సాధ్యం కాలేదని వివరించారు. ఆ చిత్రం చేసి ఉంటే బాగుండేదని ఇప్పటికీ అనిపిస్తుందని నరేష్ పేర్కొన్నారు.

దర్శకుడు మారుతి దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన “భలే భలే మగాడివోయ్” చిత్రాన్ని అల్లరి నరేష్ రిజెక్ట్ చేశారనే ప్రచారం చాలాకాలంగా ఉంది. ఈ విషయంపై ఆయన స్పష్టతనిస్తూ, మారుతి తనను వేరే కథతో కలిశారని, “భలే భలే మగాడివోయ్” కథ తనకు చెప్పలేదని వివరించారు. “చాలా మందికి ఒక మిస్ కన్సెప్షన్ ఏంటంటే, భలే భలే మగాడివోయ్ ఫస్ట్ నానికి కంటే ముందు నాకు వచ్చింది, నేను రిజెక్ట్ చేశాను అని. అది నేను రిజెక్ట్ చేయలేదండి” అని నరేష్ స్పష్టం చేశారు. అయితే, ఆ సినిమాను చూసిన తర్వాత, అది మంచి కామెడీ జోనర్‌లో ఉందని, తను చేసి ఉంటే బాగుండేదని అనిపించిందని, ఆ విజయం నానికి దక్కినందుకు సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అలాంటి హాస్య చిత్రాలలో నటించడానికి తాను ఇష్టపడతానని తెలిపారు.

షూటింగ్‌లు లేనప్పుడు తన రోజువారీ రొటీన్ గురించి మాట్లాడుతూ, తాను జిమ్ ఫ్రీక్ కాదని, వెయిట్ లిఫ్టింగ్ వంటివి చేయనని చెప్పారు. బేసిక్, ఫ్లెక్సిబుల్ వ్యాయామాలు మాత్రమే చేస్తానని తెలిపారు. కామెడీ నటులకు మస్కులర్‌గా ఉండటం కంటే శరీరం సరళంగా ఉండటం ముఖ్యమని తన స్నేహితుడు రవి చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారిని స్ఫూర్తిగా తీసుకుని, ఒకే బరువును నిర్వహించడానికి ప్రయత్నిస్తానని, పొట్ట రాకుండా డైట్ పాటిస్తానని చెప్పారు. అయితే, తాను పెద్ద ఫుడీ అని, ఇష్టమైన ఆహారాన్ని ఎలాంటి పరిమితులు లేకుండా తింటానని అంగీకరించారు. ఉదయం ఆఫీస్ పనులు చూసుకొని, మధ్యాహ్నం భోజనం తర్వాత అన్నయ్య కొడుకుతో ఆడుకుంటానని, సాయంత్రం మళ్లీ ఆఫీస్‌కు వెళ్లి రాత్రి 9-9:30 వరకు పనులు చూసుకుంటానని వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..

అల్లరి నరేష్..

Allari Naresh

Allari Naresh

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఇదేం సినిమా రా నాయనా.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చి దుమ్ములేపుతున్న మూవీ.. ట్రెండింగ్ నంబర్ 1గా రచ్చ రచ్చ..

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← నాలుగు గ్రహాల తిరోగమనం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!భర్త కళ్లెదుటే పెద్ద పులికి బలైన భార్య.. దసరా వేళ హైదరాబాద్ బాలుడిపై చిరుత దాడి! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com