☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Amaravati Development : అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు.. మరో రైల్వేలైన్.. రూ.599కోట్లతో టెండర్లకు ఆహ్వానం..

Amaravati Development : ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. రాజధాని ప్రాంతంలో వడ్డమాను నుంచి నంబూరు వరకు 28.35 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ నిర్మాణానికి రూ.599.33కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను ఆహ్వానించారు.
Amaravati Development : అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు.. మరో రైల్వేలైన్.. రూ.599కోట్లతో టెండర్లకు ఆహ్వానం..

Amaravati Development : ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అమరావతిని రాజధానిలో అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలు చేయడంతోపాటు పలు అంతర్జాతీయ కంపెనీలను కూడా ఆహ్వానించారు. ఈ క్రమంలో అమరావతి మీదుగా మరో రైల్వేలైన్ నిర్మాణానికి టెండర్లు పిలిచారు.

Also Read : Are You Buying Gold : బంగారం కొనుగోలు చేస్తున్నారా? అయితే, ఈ విషయాలు తెలుసుకోండి.. లేదంటే మోసపోయినట్లే..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతానికి రైల్వే కనెక్టివిటీ మరింత బలోపేతం కానుంది. అమరావతి మీదుగా ఎర్రుపాలెం – నంబూరు రైల్వే‌లైన్‌లో చివరి ప్యాకేజీకి రైల్వేశాఖ టెండర్లు ఆహ్వానించింది. ఈ రైల్వే‌లైన్ పూర్తయితే అమరావతి రాజధాని ప్రాంతానికి రవాణా, కనెక్టివిటీ, ఆర్థిక అభివృద్ధికి మరింత ఊతం లభించే పరిస్థితి ఏర్పడుతుంది.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ రైల్వే‌లైన్ నిర్మాణంకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. ఎర్రుపాలెం – అమరావతి – నంబూరు రైల్వేలైన్ ప్రాజెక్టు మొత్తం 58.10 కిలో మీటర్లు. దీన్ని నాలుగు ప్యాకేజీలుగా నిర్మించనున్నారు.

ఖమ్మం జిల్లా పరిధిలో ఎర్రుపాలెం నుంచి పెద్దాపురం సమీపం వరకు తెలంగాణ ఫరిధిలో 3.5 కిలోమీటర్లు మొదటి ప్యాకేజీకాగా.. పెద్దాపురం నుంచి కృష్ణా నది వంతెన వరకు ఎన్టీఆర్ జిల్లాలో రెండో ప్యాకేజీ. ఇక కృష్ణా నదిపై 3.23 కిలోమీటర్ల మేర వంతెనతోపాటు పల్నాడు జిల్లాలో వడ్డమాను వరకు లైన్ నిర్మాణ పనులు మూడో ప్యాకేజీ కింద చేపట్టనున్నారు. ఇప్పటికే ఈ మూడు ప్యాకేజీలకు టెండర్లను ఆహ్వానించారు. తాజాగా.. నాల్గో ప్యాకేజీ అయిన వడ్డమాను నుంచి నంబూరు వరకు 28.35 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణ పనుల కోసం తాజాగా టెండర్లు ఆహ్వానించారు.

అమరావతి రాజధాని ప్రాంతంలో వడ్డమాను నుంచి నంబూరు వరకు 28.35 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ నిర్మాణానికి రూ.599.33కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను ఆహ్వానించారు. నవంబర్ 23వ తేదీ వరకు బిడ్ల దాఖలుకు గడువు కూడా ఇచ్చారు. ఈపీపీ విధానంలో నిర్మించే ఈ నిర్మాణాన్ని రెండున్నరేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుందని దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇంజనీర్లు వెల్లడించారు.

ఇదిలాఉంటే.. ఈ నాలుగు ప్యాకేజీల పరిధిలో మొత్తం తొమ్మిది చోట్ల రైల్వే స్టేషన్లను నిర్మించనున్నారు. పెద్దాపురం, చెన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పరావురు ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లను నిర్మించనున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG
← Gautam Gambhir : వెస్టిండీస్ పై భార‌త్ వ‌న్డే సిరీస్ విజ‌యం.. హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ పోస్ట్ వైర‌ల్‌..Rohit-Virat kohli : వెస్టిండీస్‌తో వ‌న్డే సిరీస్ ముగిసింది.. కోహ్లీ, రోహిత్‌ల‌ను మ‌ళ్లీ భార‌త జెర్సీలో ఎప్పుడు చూడొచ్చంటే? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com