☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

అమెజాన్ లేఆఫ్స్ యూటర్న్: పీకేసిన ఉద్యోగులకు తిరిగి రిక్రూట్ మెయిల్స్

అమెజాన్ లేఆఫ్స్ యూటర్న్: పీకేసిన ఉద్యోగులకు తిరిగి రిక్రూట్ మెయిల్స్ Caption of Image. గడచిన కొన్ని నెలలుగా లేఆఫ్స్ కారణంగా టెక్ ప్రపంచం అట్టుడుకుతున్న సమయంలో.. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తీసుకున్న ఓ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకవైపు గూగుల్, మెటా, ఒరాకిల్ వంటి పెద్ద కంపెనీలు తమ సిబ్బందిని తగ్గించుకుంటూ పోతుంటే.. దీనికి భిన్నంగా టెక్ దిగ్గజం అమెజాన్ మాత్రం తన దారి వేరేనంటోంది. కొద్దికాలం క్రితం ఉద్యోగాల నుంచి తొలగించిన పాత ఉద్యోగులకే మళ్లీ నియమించుకుంటూ యూటర్న్ తీసుకుంది. ఎక్కడ చూసినా AI హవా నడుస్తున్న వేళ.. టెక్ రంగంలో ఈ పరిణామం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా కొనసాగిన రీస్ట్రక్చరింగ్ ప్రక్రియలో భాగంగా అమెజాన్ ఏకంగా 30 వేలకు పైగా ఉద్యోగులను ఇంటికి పంపిన సంగతి తెలిసిందే.
అమెజాన్ లేఆఫ్స్ యూటర్న్: పీకేసిన ఉద్యోగులకు తిరిగి రిక్రూట్ మెయిల్స్
అమెజాన్ లేఆఫ్స్ యూటర్న్: పీకేసిన ఉద్యోగులకు తిరిగి రిక్రూట్ మెయిల్స్

గడచిన కొన్ని నెలలుగా లేఆఫ్స్ కారణంగా టెక్ ప్రపంచం అట్టుడుకుతున్న సమయంలో.. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తీసుకున్న ఓ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకవైపు గూగుల్, మెటా, ఒరాకిల్ వంటి పెద్ద కంపెనీలు తమ సిబ్బందిని తగ్గించుకుంటూ పోతుంటే.. దీనికి భిన్నంగా టెక్ దిగ్గజం అమెజాన్ మాత్రం తన దారి వేరేనంటోంది. కొద్దికాలం క్రితం ఉద్యోగాల నుంచి తొలగించిన పాత ఉద్యోగులకే మళ్లీ నియమించుకుంటూ యూటర్న్ తీసుకుంది. ఎక్కడ చూసినా AI హవా నడుస్తున్న వేళ.. టెక్ రంగంలో ఈ పరిణామం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

గత కొంతకాలంగా కొనసాగిన రీస్ట్రక్చరింగ్ ప్రక్రియలో భాగంగా అమెజాన్ ఏకంగా 30 వేలకు పైగా ఉద్యోగులను ఇంటికి పంపిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఏఐ, మెషిన్ లెర్నింగ్ డిపార్ట్మెంట్లలో అప్పట్లో లేఆఫ్‌కి గురైన టాలెంటెడ్ టెక్కీలను కంపెనీ మళ్లీ వెతుక్కుంటోంది. AWS వైస్ ప్రెసిడెంట్ స్వామి శివసుబ్రమణియన్ నేతృత్వంలో "స్వామిస్ బూమరాంగ్ రీఎంగేజ్ మెంట్ ఇనిషియేటివ్" పేరుతో ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

"మీరు వెళ్ళిపోయినప్పటి నుంచి చాలా మార్పులొచ్చాయి, ప్రస్తుతం ఏఐ, ఎంఎల్ రంగంలో అద్భుతమైన ప్రాజెక్టులు నడుస్తున్నాయి" అంటూ పాత ఉద్యోగులకు అమెజాన్ రిక్రూటర్ల నుంచి ఈమెయిల్స్ వెళ్లాయి. దీంతో -మెయిల్స్ అందుకున్న మాజీ ఉద్యోగులు సైతం ఈ క్రేజీ ఆఫర్ తో ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇది ఆఫీస్ కి రావాలనే నిబంధనల వల్ల మానేసిన వారి కోసం కాదని, కేవలం ప్రస్తుత ఓపెన్ రోల్స్ కోసమే అని అమెజాన్ ప్రతినిధి హేలీ సిల్వా స్పష్టం చేశారు.

ఈ 'బూమరాంగ్ హైరింగ్' అనేది కొత్తేమీ కాదని, మాజీ ఉద్యోగులను వెనక్కి తీసుకోవడం తమ కంపెనీలో ఎప్పట్నుంచో ఉన్న పద్ధతేనని అమెజాన్ చెబుతోంది. లేఆఫ్స్ లో ఉద్యోగాలు కోల్పోయిన వారు సైతం తిరిగి చేరేందుకు అర్హులేనని స్పష్టం చేసింది. ప్రస్తుత కఠినమైన జాబ్ మార్కెట్ లో టెక్ దిగ్గజాలు తమ వ్యూహాలను ఏ విధంగా మార్చుకుంటున్నాయో చెప్పడానికి ఇదొక నిదర్శనం. కస్టమ్ సిలికాన్ అభివృద్ధి, ఏఐ క్లౌడ్ సేవలు వంటి హై-గ్రోత్ రంగాలపై అమెజాన్ ఇప్పుడు పూర్తి ఫోకస్ పెట్టింది.

ALSO READ : 2BHK ఇంటి అద్దె నెలకు రూ.10 లక్షలా..?

మొత్తానికి ఉద్యోగాలు తీసేసి మళ్లీ అవే చేతులతో పాత ఉద్యోగులను ఆహ్వానిస్తున్న అమెజాన్ తీరు ఇప్పుడు టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో మిగతా టెక్ దిగ్గజాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ఈ 'బూమరాంగ్' ఆఫర్ టెక్కీలకు మంచి ఊరటనిస్తోంది. కొత్త కొలువుల కోసం వెతుకుంటున్న వారిని తమ పాత కంపెనీని తిరిగి రావాలని కోరుతుండటంపై టెక్కీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← Mahesh Babu: గడ్డం లేదు బాస్‌.. ఇప్పుడు ఏం చేద్దాం?.. 24 ఏళ్ల కుర్రాడిగా మహేష్ బాబు కొత్త లుక్!West Indies | భారత గడ్డపై విండీస్ చెత్తాట.. 24 ఏళ్లలో ఒక్క వన్డే సిరీస్ గెలవలే..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com