Missouri Road Accident: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన 31 ఏళ్ల మహిళ మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన దారం సుప్రియ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Read Also :Latitude Air Ambulance: ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ అంబులెన్స్ అదృశ్యం
వెనుక నుంచి ఢీకొట్టిన ట్రక్కు
ఉద్యోగరీత్యా అమెరికాలోని మిస్సోరిలో నివసిస్తున్న సుప్రియ కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున ఆమె ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ట్రక్కు ఢీకొనడంతో కారు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతకు సుప్రియ అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఆమెతో పాటు ప్రయాణిస్తున్న మరో భారతీయ యువతికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

Missouri Road Accident: మహబూబాబాద్‌లో విషాదం
సుప్రియ భర్త కొడుమూరి రంజిత్, అత్తమామలు కొడుమూరి వెంకటేశ్వర్లు, రాధిక మహబూబాబాద్ పట్టణంలోని వీరభద్ర అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్నారు. సుప్రియ మృతి చెందిన విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సుప్రియ మృతదేహాన్ని అమెరికా నుంచి స్వదేశానికి తరలించే ఏర్పాట్లపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. అధికారిక వివరాలు వెల్లడైన తర్వాత ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :






