☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Anakapalli: వర్షాల వేళ విషాదం.. తల్లీకూతుళ్లను బలిగొన్న విద్యుత్ వైరు

Anakapalli: తీవ్ర వాయుగుండం తీరం దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.. భారీ వర్షాల నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నాతవరం మండల కేంద్రంలోని గొల్లవీధిలో విద్యుత్ షాక్‌కు గురై తల్లీకూతుళ్లు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వర్షాల కారణంగా విద్యుత్ లైన్‌కు సంబంధించిన సపోర్టు తీగ ఇంటిపై పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. తెల్లవారుజామున బాత్రూమ్‌కు వెళ్తున్న సమయంలో కుమార్తె జానకి (28) విద్యుత్ వైరు తగలడంతో […]
Anakapalli: వర్షాల వేళ విషాదం.. తల్లీకూతుళ్లను బలిగొన్న విద్యుత్ వైరు

Anakapalli: తీవ్ర వాయుగుండం తీరం దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.. భారీ వర్షాల నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నాతవరం మండల కేంద్రంలోని గొల్లవీధిలో విద్యుత్ షాక్‌కు గురై తల్లీకూతుళ్లు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వర్షాల కారణంగా విద్యుత్ లైన్‌కు సంబంధించిన సపోర్టు తీగ ఇంటిపై పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. తెల్లవారుజామున బాత్రూమ్‌కు వెళ్తున్న సమయంలో కుమార్తె జానకి (28) విద్యుత్ వైరు తగలడంతో షాక్‌కు గురై కేకలు వేసింది. ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన తల్లి మంగ (55) కూడా విద్యుత్ షాక్‌కు గురయ్యారు. దీంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

తల్లీకూతుళ్లను రక్షించే క్రమంలో జానకి భర్త నాగరాజు (32) కూడా విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఆయన చెక్కతో విద్యుత్ వైర్‌ను తప్పించే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి విద్యుత్ అధికారులకు సమాచారం అందించడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. తీవ్రంగా గాయపడిన నాగరాజును స్థానికులు నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో నాతవరం గొల్లవీధిలో విషాదం నెలకొంది. వర్షాల సమయంలో విద్యుత్ వైర్లు, స్తంభాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Nissan Pixo: నిస్సాన్ పిక్సో విడుదల.. 259KM రేంజ్‌, 10-అంగుళాల డిస్‌ప్లే, Gemini వాయిస్ అసిస్టెంట్.. ఫీచర్లు ఇవేUttar Pradesh: ఉత్తరప్రదేశ్‌ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com