PM Kisan: ఏపీ రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బిగ్ అప్‌డేట్ అందించాయి. పీఎం కిసాన్ నిధులతో కలిపి ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ‘అన్నదాత సుఖీభవ’ పథకం నిధుల జమకు ముహూర్తం ఖరారైంది. విజయదశమి పండుగ కానుకగా అక్టోబర్ 17న ఈ నిధులను నేరుగా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మొదట వినాయక చవితి నాడే నిధులు విడుదల చేయాలని భావించినప్పటికీ, తాజాగా జరిగిన చర్చల అనంతరం అక్టోబర్ 17న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Read Also : Sonam Wangchuk : నన్ను ఎనౌకౌంటర్ చేస్తారేమో – వాంగుక్

PM Kisan: కేంద్రం-రాష్ట్రం కలిసి ఒకే విడతలో ఆర్థిక సాయం
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఏటా రూ. 6,000లను మూడు విడతల్లో (విడతకు రూ. 2,000 చొప్పున) అందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఏపీ ప్రభుత్వం దీనికి అదనంగా రూ. 14,000 జత చేసి మొత్తం రూ. 20,000ల సహాయాన్ని రైతులకు అందిస్తోంది. చివరిసారిగా పీఎం కిసాన్ నిధులు జూన్ మాసంలో విడుదల కాగా, తదుపరి విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే నెలలో విడుదలయ్యే ఈ విడతలో అటు కేంద్రం వాటా, ఇటు రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి ఒకేసారి రూ. 6,000 చొప్పున ప్రతి రైతు ఖాతాలో పడనున్నాయి.
ఈ-కేవైసీ తప్పనిసరి.. లేకపోతే నిధులు నిలిపివేత!
ఈ పథకం కింద లబ్ధి పొందే రైతులందరూ తమ ఇ-కేవైసీ (e-KYC) ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ-కేవైసీ పూర్తి చేయని రైతులకు తదుపరి విడత సాయం నిలిచిపోయే అవకాశం ఉంది. రైతులు అధికారిక పోర్టల్ ద్వారా తమ ఇ-కేవైసీని పూర్తి చేసుకోవడంతో పాటు, తమ అకౌంట్లో నిధుల జమ స్థితిని ఆన్‌లైన్‌లో సులభంగా తనిఖీ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :






