☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా

BC Reservations: త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (బీసీలు) సముచిత గౌరవం, ప్రాతినిధ్యం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సమర్పించిన నివేదికపై చర్చించిన అనంతరం కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. నేటి కేబినెట్ సమావేశానికి ప్రత్యేకత ఉందని పేర్కొన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీ […]
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా

BC Reservations: త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (బీసీలు) సముచిత గౌరవం, ప్రాతినిధ్యం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సమర్పించిన నివేదికపై చర్చించిన అనంతరం కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. నేటి కేబినెట్ సమావేశానికి ప్రత్యేకత ఉందని పేర్కొన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీ వర్గాలు పార్టీకి అండగా నిలుస్తున్నాయని, ఆ వర్గాలకు ఎంత చేసినా తక్కువేనని అన్నారు. గతంలో బలహీన వర్గాలకు సరైన రిజర్వేషన్లు ఉండేవి కావని గుర్తుచేశారు. దివంగత ఎన్టీఆర్ బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించారని, 1995లో పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేసి చంద్రబాబు అదనపు రిజర్వేషన్లు అందించారని తెలిపారు. అయితే, గత వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్, చంద్రబాబు కల్పించిన రిజర్వేషన్లను తగ్గించిందని ఆరోపించారు.

బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని గతంలో హైకోర్టు సూచించిందని వివరించారు అచ్చెన్నాయుడు. ఈ నేపథ్యంలో రాజీవ్ రంజన్ మిశ్రా, ఐఏఎస్ అధ్యక్షతన ఫిబ్రవరి 19న బీసీల కోసం స్వతంత్ర ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది మార్చి 23 నుంచి కమిషన్ తన కార్యకలాపాలను ప్రారంభించిందన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి, వివిధ బీసీ కుల సంఘాల నుంచి విజ్ఞప్తులు, అభిప్రాయాలను సేకరించిందని పేర్కొన్నారు. దాదాపు 7 నెలల పాటు వివిధ స్థాయిల్లో సమగ్ర అధ్యయనం నిర్వహించిన కమిషన్ ఆగస్టు 14న ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని వెల్లడించారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను సమకాలీన డేటా, ప్రస్తుత స్థానిక పరిస్థితులు, జనాభా ప్రాతిపదికన మాత్రమే ఖరారు చేసినట్లు తెలిపారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కమిషన్ నివేదికలో పొందుపరిచిందని, ఆ నివేదికను పరిశీలించిన కేబినెట్ ఆమోదించిందని వివరించారు.

స్థానిక సంస్థల్లో వివిధ పదవులకు బీసీలకు కల్పించనున్న రిజర్వేషన్ల వివరాలను మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. గ్రామ పంచాయతీ వార్డులకు 26.73 శాతం, సర్పంచ్ పదవులకు 27 శాతం, ఎంపీటీసీ స్థానాలకు 25 శాతం, ఎంపీపీ పదవులకు 24 శాతం, జడ్పీటీసీ స్థానాలకు 26 శాతం, జడ్పీ చైర్మన్ పదవులకు 23 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు తెలిపారు. మున్సిపల్ చైర్‌పర్సన్లు, మేయర్లు, వైస్ చైర్మన్లకు 34 శాతం రిజర్వేషన్లు ఉంటాయని పేర్కొన్నారు. రిజర్వేషన్లకు సంబంధించిన జాబితాను రేపు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించడంతో పాటు, పార్టీ పరంగా కూడా 34 శాతం ప్రాతినిధ్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. అవసరమైన చోట 34 శాతానికి మించి బీసీలకు పదవులు కల్పించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బీసీలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యం కల్పించడం, వారి ప్రాతినిధ్యాన్ని పెంచడం ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్‌చల్3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com