☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

హౌరా–చెన్నై మెయిల్‌లో కొత్తగా కనిపించిన బ్యాగులు.. చెక్ చూసి చూస్తే మైండ్‌బ్లోయింగ్!

ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ప్రభుత్వం నిఘా కట్టుదిట్టం చేసింది. 'ఆపరేషన్ చైతన్యం' ద్వారా సాగును నిర్మూలిస్తూ, 'ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్'తో విద్యార్థులను రక్షిస్తున్నారు. ఇటీవల తుని రైల్వే స్టేషన్‌లో గంజాయిని చాక్లెట్ల రూపంలో రవాణా చేస్తూ ముగ్గురిని అరెస్ట్ చేయడంతో అక్రమార్కుల కొత్త మార్గాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు గంజాయి అక్రమ రవాణాపై మరింత పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
హౌరా–చెన్నై మెయిల్‌లో కొత్తగా కనిపించిన బ్యాగులు.. చెక్ చూసి చూస్తే మైండ్‌బ్లోయింగ్!

ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ప్రభుత్వం, పోలీసులు నిఘాను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. ఒకవైపు గంజాయి సాగును నిర్మూలించేందుకు ‘ఆపరేషన్ చైతన్యం’ వంటి ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తుండగా.. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అక్రమ రవాణాపై తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు.

అయినప్పటికీ కొందరు అక్రమార్కులు పోలీసుల కళ్లుగప్పి గంజాయిని తరలించేందుకు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. తాజాగా కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్‌లో వెలుగులోకి వచ్చిన ఘటన కలకలం రేపుతోంది. గంజాయిని చాక్లెట్ల రూపంలో ప్యాకెట్లుగా తయారు చేసి రవాణా చేస్తున్న ముగ్గురు యువకులను తుని జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ సిబ్బంది అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం (సెప్టెంబర్ 25) హౌరా–చెన్నై మెయిల్ జనరల్ కోచ్‌లో తనిఖీలు చేపట్టారు. తుని రైల్వే స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై లగేజ్ బ్యాగులతో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు యువకులను రైల్వే సిబ్బంది గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని బ్యాగులను తనిఖీ చేయగా.. ఒక్కొక్కరి వద్ద మూడు చొప్పున గంజాయి చాక్లెట్ ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మనోజ్ ప్రధాన్ (27), సంబునాథ్ జనా (29), అజయ్ జనా (25)గా గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ముఖ్యంగా యువత, విద్యార్థులను డ్రగ్స్‌కు దూరంగా ఉంచడంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. EAGLE ఆధ్వర్యంలో విద్యాసంస్థల పరిసరాల్లో ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’ ద్వారా తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గంజాయితో పాటు ఇతర మాదకద్రవ్యాల విక్రయాలు, సరఫరాపైనా నిఘా కొనసాగుతోంది.

ఇక గంజాయి సాగును అరికట్టేందుకు ‘ఆపరేషన్ చైతన్యం’ కింద ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఏపీ పోలీసుల EAGLE విభాగం వెల్లడించింది. 2024–25లో 94.77 ఎకరాల్లో అక్రమ గంజాయి సాగును గుర్తించి ధ్వంసం చేసినట్లు తెలిపింది. ప్రత్యామ్నాయ పంటలు, జీవనోపాధి కార్యక్రమాల ద్వారా గంజాయి సాగు వైపు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.

తాజా తుని ఘటనతో గంజాయి అక్రమ రవాణా కొత్త రూపాల్లో జరుగుతున్న అంశం మరోసారి వెలుగులోకి వచ్చింది. దీంతో రైల్వే మార్గాలు, విద్యాసంస్థల పరిసరాలు, గంజాయి ప్రభావిత ప్రాంతాల్లో నిఘాను మరింత పటిష్టం చేస్తామని ఈగల్ టీమ్ పేర్కొంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Bigg Boss : హగ్గులు, కిస్సులు, గొడవలు.. ఇంత జరుగుతున్నా బిగ్ బాస్ హోస్ట్ గంగూలీ మౌనం వెనుక కారణం ఇదేఅదృష్టం అంటే వీరిదే.. వీరు బంగారం ధరిస్తే కోరుకున్నది జరుగుద్దీ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com