☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

AP DigiVerify : నకిలీ సర్టిఫికెట్లకు చెక్.. వెరిఫికేషన్ క్షణాల్లోనే.. ఏపీ సర్కార్ కొత్త సిస్టమ్

AP DigiVerify : సర్టిఫికెట్ చూపించడం ఒక దశ అయితే, దాని అసలైన రికార్డును డిజిటల్‌గా నిర్ధారించడం మరో దశ. ఆ రెండింటినీ ఒకే వ్యవస్థలోకి తీసుకురావడమే ఏపీ డీజీవెరిఫై ప్రత్యేకత.
AP DigiVerify : నకిలీ సర్టిఫికెట్లకు చెక్.. వెరిఫికేషన్ క్షణాల్లోనే.. ఏపీ సర్కార్ కొత్త సిస్టమ్

AP DigiVerify : విద్యార్థులు, ఉద్యోగార్థులు ఇకపై సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గనుంది. అంతేకాదు.. సర్టిఫికెట్ అసలుదా? నకిలీదా? అనే సందేహానికి డిజిటల్ విధానంలోనే సమాధానం లభించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ఏపీ డీజీవెరిఫై’ పేరుతో తెచ్చిన ఈ బ్లాక్‌చెయిన్ ఆధారిత ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రభుత్వ ధ్రువపత్రాలను వేగంగా, డిజిటల్‌గా ధ్రువీకరించుకునే అవకాశం కల్పిస్తోంది.

Also Read : AP Schemes: ఏపీలోని రైతులకు భారీ శుభవార్త చెప్పిన కూటమి సర్కార్.. బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు వచ్చేస్తున్నాయ్..

ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నియామకాలు, వివిధ సేవలకు దరఖాస్తు చేసుకునే సమయంలో ఆలస్యానికి తావులేకుండా, నకిలీ సర్టిఫికెట్ల వినియోగాన్ని అడ్డుకోవడమే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తుంది. ఇప్పటివరకు కొన్ని సందర్భాల్లో సర్టిఫికెట్లను మాన్యువల్‌గా పరిశీలించాల్సి వచ్చేది. ఇక వీలైనంత వరకు డిజిటల్ విధానంలోనే వెరిఫికేషన్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కుల, ఆదాయ, విద్యా అర్హత, జనన, మరణ ధ్రువపత్రాలతో పాటు మీసేవ, ఏపీ సేవ ద్వారా జారీ చేసే ఇతర ప్రభుత్వ సర్టిఫికెట్లను కూడా ఈ వ్యవస్థ ద్వారా ధ్రువీకరించుకునే అవకాశం ఉంటుంది. ఈ వ్యవస్థలో కీలకంగా పనిచేసేది QR కోడ్. సర్టిఫికెట్‌పై ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేస్తే సంబంధిత డిజిటల్ రికార్డుతో వివరాలను సరిపోల్చుకోవచ్చు. దీంతో సర్టిఫికెట్ నిజమైనదేనా లేదా అనే విషయాన్ని త్వరగా గుర్తించే అవకాశం ఉంటుంది.

అంతేకాదు.. రికార్డుల్లో మార్పులు చోటుచేసుకున్నప్పుడు వాటికి అనుగుణంగా సంబంధిత సమాచారం అప్‌డేట్ అయ్యే విధంగా వ్యవస్థను రూపొందించారు. అంటే కేవలం సర్టిఫికెట్ కాపీని చూడటం కాకుండా, దాని వెనుక ఉన్న అధికారిక డేటాతో వివరాలను పరిశీలించే అవకాశం ఉంటుంది.

సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను కేవలం ప్రభుత్వ శాఖలకే పరిమితం చేయలేదు. అవసరమైన సందర్భాల్లో ప్రైవేట్ సంస్థలు కూడా అభ్యర్థులు సమర్పించిన ధ్రువపత్రాల ప్రామాణికతను తనిఖీ చేసుకునే విధంగా ఈ సేవను అందుబాటులోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఉద్యోగ నియామకాల సమయంలో సమర్పించే విద్యా, ఇతర అర్హత పత్రాల పరిశీలనలో ఇది ఉపయోగపడే అవకాశం ఉంది.

డిజిటల్‌గా సర్టిఫికెట్లు అందుబాటులోకి వస్తే డేటా భద్రత ఎలా? అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. దీనికోసం బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ధ్రువీకరించిన రికార్డులను బ్లాక్‌చెయిన్ ఆధారిత వ్యవస్థలో భద్రపరచడం ద్వారా డేటాను అనధికారికంగా మార్చడం లేదా తారుమారు చేయడాన్ని నిరోధించేలా సాంకేతిక వ్యవస్థను రూపొందించారు.

⬇ Full News JPG⬇ Short News JPG
← Priyanka Jain : గుర్రం ఎక్కిన సీరియ‌ల్ న‌టి.. ప్రియాంక జైన్ ఫోటోలు వైర‌ల్‌..Virat Kohli : వెస్టిండీస్‌తో వ‌న్డే సిరీస్‌.. కోహ్లీని ఊరిస్తున్న భారీ రికార్డులు ఇవే.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com