☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు

Andhra Pradesh High Court: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. రాష్ట్రంలో సర్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నత న్యాయస్థానానికి స్పష్టం చేశాయి. మరొకవైపు, స్థానిక సంస్థల ప్రతినిధుల పదవీకాలం ముగిసిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ తాండవ యోగేష్ అనే వ్యక్తి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ పూర్తి చేస
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు

Andhra Pradesh High Court: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. రాష్ట్రంలో సర్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నత న్యాయస్థానానికి స్పష్టం చేశాయి. మరొకవైపు, స్థానిక సంస్థల ప్రతినిధుల పదవీకాలం ముగిసిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ తాండవ యోగేష్ అనే వ్యక్తి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

అలాగే, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ పనితీరు, నివేదికపై సీనియర్ న్యాయవాది సత్యప్రసాద్ కోర్టులో కీలక వాదనలు వినిపించారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతానికి పైగా రిజర్వేషన్లు కేటాయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై కూడా హైకోర్టు ఇప్పటికే విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్‌లో ఉంచిన విషయం తెలిసిందే. మరోవైపు, పంచాయతీలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ విలీన అంశంపై పిటిషనర్ తరఫు న్యాయవాదులు తమ వాదనలను కోర్టుకు వినిపిస్తున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలుUPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com