☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Inter Board AP: ఏపీ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పబ్లిక్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల.. ఆఖరి తేదీ, పరీక్షల వివరాలు!

2027 ఇంటర్మీడియట్ (Inter Board AP)పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లింపు నోటిఫికేషన్‌ను అధికారులు అధికారికంగా విడుదల చేశారు.
Inter Board AP: ఏపీ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పబ్లిక్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల.. ఆఖరి తేదీ, పరీక్షల వివరాలు!

Inter Board AP: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంటర్ బోర్డు అత్యంత కీలకమైన సమాచారాన్ని అందించింది. 2027లో జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లింపు నోటిఫికేషన్‌ను అధికారులు అధికారికంగా విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఈ నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఆయా కళాశాలల ద్వారా ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 29వ తేదీ వరకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా సాధారణ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.

Gautam Adani: భారత్‌లోనే అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ.. ముకేశ్ అంబానీ రికార్డ్ బ్రేక్.. ఏకంగా రూ.9.23 లక్షల కోట్లతో..

ఆలస్య రుసుము వివరాలు, పరీక్షల షెడ్యూల్:

సాధారణ గడువులోగా ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులకు బోర్డు మరొక అవకాశం ఇచ్చింది. అక్టోబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. కాగా, 2027 ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు ఇంటర్మీడియట్(Inter Board AP) పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఫిబ్రవరి 23న ఇంటర్ ప్రథమ సంవత్సరం, ఫిబ్రవరి 24న ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి.

ప్రాక్టికల్ పరీక్షల సమయాలు, మార్పుల అవకాశం:

పబ్లిక్ పరీక్షలకు ముందే ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఒకేషనల్ కోర్సుల ప్రాక్టికల్స్ జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు, జనరల్ కోర్సుల ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు రెండు సెషన్లలో జరుగుతాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ ఉంటాయి. అయితే, పరిస్థితులకు అనుగుణంగా ఈ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం కూడా ఉందని అధికారులు పేర్కొన్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG
← Vaibhav Sooryavanshi : సంజూ శాంస‌న్ ప్లేస్‌లో కాదు.. ఆ స్టార్ ఆట‌గాడి స్థానంలో వైభ‌వ్ సూర్య‌వంశీకి చోటు ?Sumalatha Devi : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సుమలత దేవి ఫిర్యాదు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com