☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్‌.. నేటి నుంచే పబ్లిక్‌ పరీక్షల 2027 ఫీజు చెల్లింపులు షురూ! వారమే గడువు

రాష్ట్ర ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 2027కు సంబంధించిన పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను ఇంటర్‌ విద్యామండలి విడుదల చేసింది. సెప్టెంబర్‌ 24 నుంచి అక్టోబర్‌ 29 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చు. అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 10 వరకు రూ.1,000 ఫైన్‌తో చెల్లించే అవకాశం ఉంది. మొదటి, రెండో సంవత్సరం థియరీ పరీక్షలకు ఒక్కో ఏడాదికి రూ.600గా ఫీజును నిర్ణయించారు..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్‌.. నేటి నుంచే పబ్లిక్‌ పరీక్షల 2027 ఫీజు చెల్లింపులు షురూ! వారమే గడువు

అమరావతి, సెప్టెం బర్ 24: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 2027కు సంబంధించిన పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్‌ విద్యామండలి విడుదల చేసింది. రెగ్యులర్‌ విద్యార్థులతో పాటు గతంలో పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. సెప్టెంబర్‌ 24 నుంచి అక్టోబర్‌ 29 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా విద్యార్థులు తమ కళాశాలల ద్వారా పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 10 వరకు రూ.1,000 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. నవంబర్‌ 10 తర్వాత గడువు పొడిగింపు ఉండదని బోర్డు స్పష్టం చేసింది.

ఫీజు వివరాలు ఇలా..

మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు థియరీ పరీక్ష ఫీజును ఒక్కో సంవత్సరానికి రూ.600గా నిర్ణయించారు. రెండు సంవత్సరాల పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మొత్తం రూ.1,200 చెల్లించాల్సి ఉంటుంది. ప్రాక్టికల్‌ పరీక్షలకు రూ.275, బ్రిడ్జ్‌ కోర్సు సబ్జెక్టులకు రూ.165, రెండో సంవత్సరం వృత్తివిద్య బ్రిడ్జ్‌ కోర్సు ప్రాక్టికల్స్‌కు రూ.275గా ఫీజును నిర్ణయించారు. విద్యార్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే పరీక్ష ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియట్‌ విద్యామండలి అధికారులు సూచించారు. నిర్ణీత గడువులోపు ఫీజు చెల్లించి పరీక్షలకు సిద్ధం కావాలని తెలిపారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఇంట్లో కూరగాయలు లేనప్పుడు.. పిల్లలకు లంచ్ బాక్స్‌లో ఈ రైస్ పెడితే వదలకుండా తింటారు!కరువు కోరల్లో వేరుశనగ.. కష్టపడి సాగుచేసిన పంటను చేతులారా చిదిమేస్తున్న రైతన్నలు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com