☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

AP Inter Exams 2027: ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌.. 2027 పరీక్షల ఫీజు చెల్లింపు నోటిఫికేషన్‌ విడుదల

AP Inter Exams 2027: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ చదివే విద్యార్థులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది.. 2027లో నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ ఎగ్జామినేషన్‌కు సంబంధించి ఫీజు చెల్లింపు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నిర్ణీత గడువులో పరీక్ష ఫీజు చెల్లించాలని అధికారులు సూచించారు. సాధారణ ఫీజుతో పరీక్ష ఫీజు చెల్లించేందుకు రేపటి నుంచి అంటే సెప్టెంబర్‌ 24వ తేదీ నుంచి అక్టోబర్‌ 29 వరకు గడువు ఇచ్చారు. […]
AP Inter Exams 2027: ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌.. 2027 పరీక్షల ఫీజు చెల్లింపు నోటిఫికేషన్‌ విడుదల

AP Inter Exams 2027: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ చదివే విద్యార్థులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది.. 2027లో నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ ఎగ్జామినేషన్‌కు సంబంధించి ఫీజు చెల్లింపు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నిర్ణీత గడువులో పరీక్ష ఫీజు చెల్లించాలని అధికారులు సూచించారు. సాధారణ ఫీజుతో పరీక్ష ఫీజు చెల్లించేందుకు రేపటి నుంచి అంటే సెప్టెంబర్‌ 24వ తేదీ నుంచి అక్టోబర్‌ 29 వరకు గడువు ఇచ్చారు. విద్యార్థులు తమ కళాశాలల ద్వారా నిర్ణీత సమయంలో ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

అక్టోబర్‌ 30 నుంచి ఫైన్‌తో..
నిర్ణీత గడువులో ఫీజు చెల్లించలేని విద్యార్థులకు మరో అవకాశం కల్పించారు. అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 10 వరకు ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. విద్యార్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఇంటర్‌ పరీక్షలు ఎప్పుడంటే..?
ఏపీలో 2027 ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని ఇంటర్‌ బోర్డు ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే.. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి.. జనరల్‌ కోర్సులకు ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరగనుండగా.. ఒకేషనల్‌ కోర్సులకు జనవరి 27వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు రెండు సెషన్లలో ఉండనున్నాయి.. ఇక, ప్రాక్టికల్‌ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌ జరగనుండగా.. రెండో సెషన్‌ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి.. అయితే, గతంలో అధికారులు ప్రకటించిన ప్రకారం.. ఈ షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు..

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Ram Charan: “మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న” చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..Virat Kohli-Rohit Sharma: బరిలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 27 నుంచే సమరం.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com