☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..! • అబీయేలోని మార్కెట్‌పై డ్రోన్ దాడి: 153 మంది మృతి • పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు • Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా! • Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. • సౌరవ్ దాస్,అశుతోష్ రాంకాలపై నమోదైన రెండో కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ • పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన • ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు! •

AP MPTC, ZPTC Elections 2026: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందడి.. నేటి నుంచే నామినేషన్లు

AP MPTC, ZPTC Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందడి కొనసాగుతోంది.. ఓవైపు మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ జరుగుతుండగా.. మరోవైపు.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచే అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ మొదలుకానుంది. నామినేషన్ల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) చర్యలు చేపట్టింది. ఎల్లుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఉంది. ఈ నెల 24న ఉదయం 8 […]
AP MPTC, ZPTC Elections 2026: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందడి.. నేటి నుంచే నామినేషన్లు

AP MPTC, ZPTC Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందడి కొనసాగుతోంది.. ఓవైపు మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ జరుగుతుండగా.. మరోవైపు.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచే అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ మొదలుకానుంది. నామినేషన్ల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) చర్యలు చేపట్టింది. ఎల్లుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఉంది.

ఈ నెల 24న ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన జరగనుంది. తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీళ్లు దాఖలు చేసేందుకు ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు. ఎంపీటీసీ నామినేషన్లకు సంబంధించి అప్పీలేట్ అథారిటీగా ఆర్డీవో, జడ్పీటీసీ నామినేషన్లకు కలెక్టర్ వ్యవహరించనున్నారు. ఈ నెల 26న అప్పీళ్లపై అప్పీలేట్ అధికారులు నిర్ణయాలు తీసుకోనున్నారు.

ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ప్రచురించనున్నారు. ఇక, వచ్చే నెల 3వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అవసరమైన ప్రాంతాల్లో వచ్చే నెల 4వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ చేపట్టనున్నారు. వచ్చే నెల 5వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఫలితాలను వెల్లడించనున్నారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎస్‌ఈసీ ఏర్పాట్లు చేస్తోంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Harmanpreet Kaur 91 Runs: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలనం.. స్మృతి మంధాన రికార్డు బద్దలు!Zohran Mamdani: భారతీయులతో కలిసి గర్బా డ్యాన్స్ చేసిన న్యూయార్క్ మేయర్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com