☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..! • అబీయేలోని మార్కెట్‌పై డ్రోన్ దాడి: 153 మంది మృతి • పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు • Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా! • Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. • సౌరవ్ దాస్,అశుతోష్ రాంకాలపై నమోదైన రెండో కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ • పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన • ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు! •

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అనిల్ చంద్ర పునేఠా సోమవారం షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించారు. మొత్తం 659 జెడ్పీటీసీ, 9,829 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 21న మొదలవుతుంది. అభ్యర్థులు అక్టోబర్ 23 వరకు నామినేషన్ పత్రాలను సమర్పించవచ్చు. అక్టోబర్ 24న నామినేషన్ల పరిశీలన […] The post ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల appeared first on Adya News Telugu.
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అనిల్ చంద్ర పునేఠా సోమవారం షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించారు. మొత్తం 659 జెడ్పీటీసీ, 9,829 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.

ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 21న మొదలవుతుంది. అభ్యర్థులు అక్టోబర్ 23 వరకు నామినేషన్ పత్రాలను సమర్పించవచ్చు. అక్టోబర్ 24న నామినేషన్ల పరిశీలన నిర్వహిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 27 వరకు తుది గడువు ఇచ్చారు. నవంబర్ 3న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అనంతరం నవంబర్ 5న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు.

ఎన్నికల వ్యయ పరిమితిని కూడా ఎన్నికల సంఘం ఖరారు చేసింది. ఎంపీటీసీ అభ్యర్థి గరిష్టంగా రూ.4 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. జెడ్పీటీసీ అభ్యర్థికి రూ.8 లక్షల వరకు వ్యయ పరిమితి నిర్ణయించారు. ఎన్నికల నిర్వహణ కోసం జెడ్పీటీసీలకు 28 మంది, ఎంపీటీసీలకు 687 మంది రిటర్నింగ్ అధికారులను నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35,333 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. వీటిలో 9,186 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు.

నామినేషన్ల ప్రక్రియలో పారదర్శకత కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నామినేషన్ల కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ దృశ్యాలను కలెక్టర్లు, ఎస్పీలు మరియు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తాయి. అయితే, ఇటీవల నామినేషన్ల సందర్భంగా జరిగిన ఘర్షణలు, హింసాత్మక ఘటనలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఎస్‌ఈసీ దాటవేత ధోరణి ప్రదర్శించింది. జిల్లాల కలెక్టర్ల నుంచి పూర్తి నివేదిక అందిన తర్వాతే చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.

The post ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల appeared first on Adya News Telugu.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← యూరప్‌లో నిరసనల హోరు.. పెరుగుతున్న‌ ప్రజాగ్రహం!టైగర్ ష్రాఫ్ పై కాల్పుల క‌ల‌క‌లం! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com