☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

Ap Pension New Rules: ఏపీ పింఛన్‌దారులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. డైరెక్ట్ అకౌంట్స్ లోకి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక భద్రతా పింఛన్ల (Ap Pension New Rules)పంపిణీ ప్రక్రియలో ప్రభుత్వం సంచలన మార్పులు చేపట్టింది.
Ap Pension New Rules: ఏపీ పింఛన్‌దారులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. డైరెక్ట్ అకౌంట్స్ లోకి

Ap Pension New Rules: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ ప్రక్రియలో ప్రభుత్వం సంచలన మార్పులు చేపట్టింది. నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త విధానం ప్రకారం, జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కింద లభించే కేంద్ర ప్రభుత్వ వాటా నిధులు ఇకపై నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. కేంద్ర నిబంధనలకు అనుగుణంగా తీసుకొచ్చిన ఈ మార్పుపై గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సెర్ప్ సీఈఓ వాకాటి కరుణ స్పష్టత ఇచ్చారు. ఈ నూతన పద్ధతి ద్వారా పింఛన్ల అందజేతలో మరింత పారదర్శకత పెరుగుతుందని, మధ్యవర్తుల జోక్యం పూర్తిగా తొలగిపోతుందని అధికారులు భావిస్తున్నారు.

Mad Sandhu Murder: పంజాబ్‌లో ఘోర ఘటన.. ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ మ్యాడ్ సంధు హత్య.. నడిరోడ్డుపై కాల్చి

లబ్ధిదారులకు మిగిలే నగదు పంపిణీ వివరాలు:

ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఇస్తున్న పింఛన్లలో(Ap Pension New Rules) కేంద్ర వాటా మినహాయించి, మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ వాటాను మాత్రమే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రతినెలా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా అందిస్తారు. ఉదాహరణకు, వృద్ధులకు అందే రూ.4,000 పింఛనులో రాష్ట్ర వాటా రూ.3,800 చేతికి అందగా, కేంద్ర వాటా రూ.200 నేరుగా బ్యాంక్ అకౌంట్‌లో పడుతుంది. అలాగే దివ్యాంగుల రూ.6,000 పింఛనులో రూ.5,700 చేతికి ఇవ్వగా, రూ.300 బ్యాంక్ ఖాతాలో జమ కానుంది.

ఆధార్ అనుసంధానం తప్పనిసరి:

అయితే ఈ కేంద్ర నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కావాలంటే బ్యాంక్ అకౌంట్‌‌కు తప్పనిసరిగా ఆధార్ అనుసంధానం పూర్తయి ఉండాలి. ఆధార్ అనుసంధానం లేకపోతే కేంద్ర వాటా డబ్బులు అకౌంట్‌లో జమ కావు. కాబట్టి లబ్ధిదారులు వెంటనే తమ బ్యాంక్ ఖాతాలకు ఆధార్ అనుసంధాన ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం హెచ్చరించింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← APSRTC: గుడ్ న్యూస్ చెప్పిన APSRTC.. వారికి పూర్తిగా ఫ్రీ జర్నీ.. రూ.2 వేలు కూడాMad Sandhu Murder: పంజాబ్‌లో ఘోర ఘటన.. ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ మ్యాడ్ సంధు హత్య.. నడిరోడ్డుపై కాల్చి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com