☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. నెల రోజుల్లో ప్రమోషన్లు!

ఆంధ్రప్రదేశ్‌లోని స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త. నెల రోజుల్లో అర్హులైన వారికి పదోన్నతులు కల్పిస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి హామీ ఇచ్చారు. సచివాలయ ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో పదోన్నతులు, జీతాలు, సర్వీస్‌ సమస్యలపై చర్చించారు. AAS అమలు, ప్రొబేషన్‌ ఆలస్యం, ఇంక్రిమెంట్లు వంటి ఉద్యోగుల డిమాండ్లను త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.
స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. నెల రోజుల్లో ప్రమోషన్లు!

ఆంధ్రప్రదేశ్‌లో స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం కీలక హామీ ఇచ్చింది. అర్హత ఉన్న ఉద్యోగులకు నెల రోజుల్లోగా పదోన్నతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. అమరావతిలో సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రి సమావేశమై వారి సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా పదోన్నతులు, జీతాలు, సర్వీస్‌ సమస్యలు తదితర అంశాలను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

ఇటీవలే ఆరేళ్ల సీనియారిటీ ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌ (AAS) అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 11వ పీఆర్‌సీ నిబంధనల ప్రకారం స్పెషల్‌ గ్రేడ్‌ పోస్టు స్కేల్‌ వర్తింపజేయాలని ఆదేశించింది.

అయితే ప్రమోషన్లు లేకపోవడం, ప్రొబేషన్‌ ఆలస్యం, ఇంక్రిమెంట్లు, జీతాల పెంపు వంటి అంశాలపై ఉద్యోగులు చాలాకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. AAS కింద రెండు నోషనల్‌ ఇంక్రిమెంట్లు, ప్రొబేషన్‌ ఆలస్యానికి సంబంధించిన ప్రయోజనాలు, మెరుగైన ప్రమోషన్‌ ఛానల్‌ తదితర డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నుంచి ప్రకటన రావడం గమనార్హం.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Iran-US: ఇరాన్ తాజా వార్నింగ్.. మళ్లీ దాడి చేస్తే యుద్ధం హిందూ మహాసముద్రం దాకా విస్తరిస్తుందని హెచ్చరికMarriage Tips: పెళ్లి తర్వాత ఫోన్‌లో ఏం ఉంచాలి.. ఏం తొలగించాలి? ఈ విషయాలు తెలుసుకోండి! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com