☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

AP Social Media Influencer Policy: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు సర్కార్‌ గుడ్‌న్యూస్.. ఫాలోవర్లను బట్టి పారితోషికం..

AP Social Media Influencer Policy: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఇన్‌ఫ్లుయెన్సర్‌ పాలసీకి ఆమోదం లభించింది.. ఐదు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్‌ పాలసీలను పరిశీలించిన అనంతరం పారితోషికంపై నిర్ణయం తీసుకున్నట్లు.. కేబనెట్‌ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఆయా రాష్ట్రాల్లో ఇస్తున్న పారితోషికాలను పరిశీలించి, రాష్ట్రానికి అనుగుణంగా చెల్లింపులు నిర్ణయించినట్లు తెలిపారు. ఫాలోవర్ల […]
AP Social Media Influencer Policy: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు సర్కార్‌ గుడ్‌న్యూస్.. ఫాలోవర్లను బట్టి పారితోషికం..

AP Social Media Influencer Policy: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఇన్‌ఫ్లుయెన్సర్‌ పాలసీకి ఆమోదం లభించింది.. ఐదు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్‌ పాలసీలను పరిశీలించిన అనంతరం పారితోషికంపై నిర్ణయం తీసుకున్నట్లు.. కేబనెట్‌ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఆయా రాష్ట్రాల్లో ఇస్తున్న పారితోషికాలను పరిశీలించి, రాష్ట్రానికి అనుగుణంగా చెల్లింపులు నిర్ణయించినట్లు తెలిపారు.

ఫాలోవర్ల ఆధారంగా పారితోషికం
కొత్త పాలసీ ప్రకారం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు వారి ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా పారితోషికం చెల్లించనున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఎక్కువ మొత్తంలో పారితోషికం ఇస్తున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. కేటగిరీ–ఏలో ఉండాలంటే లక్షకు పైగా వ్యూస్‌ ఉండాలనే నిబంధనను కూడా పేర్కొన్నారు. లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్లకు గరిష్టంగా రూ.15 వేల వరకు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 50 వేల నుంచి 99,999 వరకు ఫాలోవర్లు ఉన్నవారికి రూ.7,500 అందించనున్నారు.

ఫాలోవర్ల కేటగిరీల వారీగా చెల్లింపులు
లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్లకు గరిష్టంగా రూ.15 వేల వరకు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 50 వేల నుంచి 99,999 వరకు ఫాలోవర్లు ఉన్నవారికి రూ.7,500 అందించనున్నారు. 25 వేల నుంచి 49,999 మంది వరకు ఫాలోవర్లు ఉన్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు రూ.5,000 చెల్లించనున్నారు. అలాగే 10 వేల నుంచి 24,999 మంది వరకు ఫాలోవర్లు ఉన్నవారికి రూ.2,500 వరకు చెల్లించాలని నిర్ణయించారు. ఈ మొత్తాలను అర్హత పొందిన ఇన్‌ఫ్లుయెన్సర్లకు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. కొత్త పాలసీ ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు, విధానాలు, ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా చేరవేసే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..Sahil Wakode Death: ‘‘నేను తప్పు చేశా’’.. ఆతహత్యకు ముందు స్నేహితురాలికి సాహిల్ చివరి కాల్.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com