☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Weather Alert: మరో 3 రోజులు భారీ వర్ష సూచన.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఉత్తరాంధ్రలో తీవ్ర ప్రభావం కనిపిస్తుండగా, తెలంగాణలో ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Weather Alert: మరో 3 రోజులు భారీ వర్ష సూచన.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో వాయుగుండం వణుకు పుట్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఉత్తరాంధ్రపై వాయుగుండం ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.. అయితే.. గడిచిన 6 గంటల్లో గంటకు 7 కిమీ వేగంతో తీవ్ర వాయుగుండం కదిలిందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తీవ్ర వాయుగుండం కళింగపట్నంకు 70కిమీ, రాయగడ(ఒడిశా) కు 80కిమీ దూరంలో ఉంది. సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడనుంది. ఆ తదుపరి 24 గంటలలో మరింత బలహీనపడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తీరం దాటినప్పటికీ గురువారం, శుక్రవారం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలతో వచ్చే ఆకస్మిక వరదలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు హైఅలెర్ట్ గా ఉండాలని సూచించారు.

సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నేడు, రేపు కూడా వర్షాలు కురవనున్నాయని.. వివిధ జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షాలతో ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే క్షేత్రస్థాయికి వెళ్లి చక్కదిద్దాలన్నారు. విద్యుత్ సరఫరాలో ఎక్కడా అంతరాయం కనిపించకూడదన్నారు. కంట్రోల్ రూములు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయి నుంచి సమాచారం తీసుకోవాలన్నారు. చెరువులు నింపడంపై ఫోకస్ పెట్టడంతో పాటు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. క్షేత్రస్థాయి నుంచి ఎలాంటి సాయం కోరినా వెంటనే స్పందించాలని.. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్రానికి మరో రెండు మూడు రోజులపాటు వర్ష సూచన..

తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఈరోజు భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు 5 జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచనతో రెడ్ అలర్ట్ జారీ చసింది. అతి భారీ వర్ష సూచనతో 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. భారీ వర్ష సూచనతో 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొమరం భీమాసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. ఆదిలాబాదు, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జనగాం, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్నగర్, వనపర్తి జోగులాంబ గద్వాల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలుల తీవ్రత గంటకు 40 నుంచి 50 కి.మీ, పల్లి జిల్లాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. కామారెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ నారాయణపేట జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Video: తొలి ట్రోఫీని ముద్దాడిన టీమిండియా.. 19 ఏళ్ల ఆ ఫైనల్ సీన్ గుర్తుందా..?ఈ గుర్రం తోక చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. ఏకంగా 13 అడుగులు! గిన్నిస్ రికార్డ్ సొంతం! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com