☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో ఇండియాలో ఆపిల్ పే లాంచ్..!

యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో ఇండియాలో ఆపిల్ పే లాంచ్..! Caption of Image. ఆపిల్ సంస్థ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తన డిజిటల్ పేమెంట్స్ సర్వీస్ 'ఆపిల్ పే'ని ఎట్టకేలకు భారత్‌లో లాంచ్ చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ పేమెంట్స్ మార్కెట్లలో ఒకటైన భారత్‌లోకి ఈ సర్వీస్ ప్రవేశించడం డిజిటల్ చెల్లింపుల రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. భారత్‌లో డిజిటల్ చెల్లింపులు వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. ఈ సర్వీస్ రాకతో వినియోగదారులకు మరింత సులభమైన చెల్లింపుల అనుభూతి లభించనుంది. ప్రస్తుతం ఈ సర్వీస్ ప్రారంభ దశలో భాగంగా కేవలం యాక్సిస్ బ్యాంక్ జారీ చేసిన వీసా, మాస్టర్‌‌కార్డ్ క్రెడిట్ కార్డు యూజర్లకు మాత్రమే ఇది అందుబాటులో ఉంది. అయితే రాబోయే రోజుల్లో మరిన్ని బ్యాంకులను ఇందులో చేర్చడానికి ఆపిల
యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో ఇండియాలో ఆపిల్ పే లాంచ్..!
యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో ఇండియాలో ఆపిల్ పే లాంచ్..!

ఆపిల్ సంస్థ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తన డిజిటల్ పేమెంట్స్ సర్వీస్ 'ఆపిల్ పే'ని ఎట్టకేలకు భారత్‌లో లాంచ్ చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ పేమెంట్స్ మార్కెట్లలో ఒకటైన భారత్‌లోకి ఈ సర్వీస్ ప్రవేశించడం డిజిటల్ చెల్లింపుల రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. భారత్‌లో డిజిటల్ చెల్లింపులు వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. ఈ సర్వీస్ రాకతో వినియోగదారులకు మరింత సులభమైన చెల్లింపుల అనుభూతి లభించనుంది.

ప్రస్తుతం ఈ సర్వీస్ ప్రారంభ దశలో భాగంగా కేవలం యాక్సిస్ బ్యాంక్ జారీ చేసిన వీసా, మాస్టర్‌‌కార్డ్ క్రెడిట్ కార్డు యూజర్లకు మాత్రమే ఇది అందుబాటులో ఉంది. అయితే రాబోయే రోజుల్లో మరిన్ని బ్యాంకులను ఇందులో చేర్చడానికి ఆపిల్ సన్నాహాలు చేస్తోంది. ఫుడ్ అండ్ బెవరేజెస్, ట్రావెల్, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ వంటి వివిధ ప్రముఖ మర్చెంట్స్ వద్ద ఆపిల్ పే ఉపయోగించి పేమెంట్స్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది.

ఈ పేమెంట్ విధానం చాలా సులభంగా, వేగంగా పనిచేస్తుంది. యూజర్లు ఎలాంటి కార్డ్ పిన్, ఓటీపీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. స్టోర్లలో మీ ఐఫోన్, ఆపిల్ వాచ్‌ను ఎన్‌ఎఫ్‌సీ టెర్మినల్ దగ్గర ఉంచి.. ఫేస్ ఐడీ, టచ్ ఐడీ, పాస్‌కోడ్ ఉపయోగించి ఈజీగా పేమెంట్స్ పూర్తి చేయవచ్చు.

ఆపిల్ పే అత్యున్నత భద్రత, గోప్యతా ప్రమాణాలతో వస్తోంది. మీ అసలు కార్డ్ నంబర్లు డివైజ్‌లో గానీ, ఆపిల్ సర్వర్లలో గానీ స్టోర్ కావు. అలాగే మర్చెంట్స్‌తో షేర్ చేయబడవు. దీని బదులు ఎన్‌క్రిప్ట్ చేయబడిన ప్రత్యేకమైన 'డివైజ్ అకౌంట్ నంబర్' ఉపయోగపడుతుంది. మాస్టర్‌కార్డ్ టోకనైజేషన్ టెక్నాలజీ ద్వారా లావాదేవీలు మరింత ఈజీగా మారుతాయి.

ALSO READ : రివర్స్ గేర్ వేసిన గోల్డ్ రేట్లు..

ఈ సేవలను వినియోగించుకోవడానికి కొన్ని నిర్దిష్టమైన ఆపిల్ డివైజులు, సాఫ్ట్‌వేర్ అవసరం. ఐఫోన్ XR లేదా ఆ తర్వాతి మోడల్స్.. ఆపిల్ వాచ్ సిరీస్ 6 లేదా ఆ తర్వాతి మోడల్స్ ఆపిల్ పే సేవలకు కంప్యాటబుల్. అలాగే ఐప్యాడ్, మాక్ డివైజుల్లో కూడా త్వరలోనే పూర్తి సపోర్ట్ లభించనుంది.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్.. సాంకేతిక లోపంతో వెనక్కి మళ్లిన ఫ్లైట్Chiranjeevi Remuneration: నెట్‌ఫ్లిక్స్ షో కోసం చిరంజీవికి భారీ రెమ్యునరేషన్.. ఎంతో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com