☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?

Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ రెండో సెమీఫైనల్‌లో భారత్‌ శ్రీలంక ముందు 170 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నిషిన్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో భారత్‌ 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మ్యాచ్ విషయానికి వస్తే.. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 21 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ […]
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?

Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ రెండో సెమీఫైనల్‌లో భారత్‌ శ్రీలంక ముందు 170 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నిషిన్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో భారత్‌ 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.

మ్యాచ్ విషయానికి వస్తే.. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 21 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 3 బంతుల్లో 7 పరుగులు చేసి మరోసారి నిరాశపరిచాడు. అలాగే సంజూ శాంసన్ 9 బంతుల్లో 7, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 13 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేశారు.

అయితే భారత ఇన్నింగ్స్‌ను ఇషాన్ కిషన్ ముందుండి నడిపించాడు. 46 బంతులు ఎదుర్కొన్న ఇషాన్ 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్ 3 బంతుల్లో 7 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో భారత్‌ 169 పరుగులకు చేరుకుంది. శ్రీలంక బౌలర్లలో సహన్ అరచ్చిగె 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అలాగే తరిందు రత్నాయకె 2 వికెట్లు పడగొట్టగా, వనుజ సహన్, లసిత్ క్రూస్‌పుల్లె చెరో వికెట్ సాధించారు.

ఇప్పుడు శ్రీలంక 20 ఓవర్లలో 170 పరుగులు చేస్తే ఫైనల్‌కు చేరుతుంది. ఈ సెమీఫైనల్ విజేత ఇప్పటికే ఫైనల్‌లో చోటు దక్కించుకున్న పాకిస్థాన్‌తో స్వర్ణ పతకం కోసం తలపడనుంది. ఒకవేళ ఓడిపోతే బంగ్లాదేశ్ తో కాంస్య పతకం కోసం పోరాడాల్సి వస్తుంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← BC Reservation: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు.. జీవోలు కొట్టివేతATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com