☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఆసియా క్రీడల్లో ప‌సిడి ఖాతా తెరిచిన భార‌త్

ఆసియా క్రీడల్లో భారత షూటర్లు ఎట్టకేలకు పసిడి ఖాతా తెరిచారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు తొలి స్వర్ణం దక్కింది. సురుచి సింగ్, కమల్‌జీత్ జోడీ అద్భుత ప్రదర్శన చేసింది. ఈ జంట ఫైనల్లో 484.6 స్కోరు సాధించి సరికొత్త గేమ్స్ రికార్డు నెలకొల్పింది. దక్షిణ కొరియా రజతం గెలవగా, ఇరాన్ కాంస్యం సొంతం చేసుకుంది. వ్యక్తిగత విభాగాల్లో విఫలమైనప్పటికీ, మిక్స్‌డ్ విభాగంలో ఈ జోడీ అద్భుతంగా పుంజుకుంది. షూటింగ్‌లోనే భారత్‌కు […] The post ఆసియా క్రీడల్లో ప‌సిడి ఖాతా తెరిచిన భార‌త్ appeared first on Adya News Telugu.
ఆసియా క్రీడల్లో ప‌సిడి ఖాతా తెరిచిన భార‌త్

ఆసియా క్రీడల్లో భారత షూటర్లు ఎట్టకేలకు పసిడి ఖాతా తెరిచారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు తొలి స్వర్ణం దక్కింది. సురుచి సింగ్, కమల్‌జీత్ జోడీ అద్భుత ప్రదర్శన చేసింది. ఈ జంట ఫైనల్లో 484.6 స్కోరు సాధించి సరికొత్త గేమ్స్ రికార్డు నెలకొల్పింది. దక్షిణ కొరియా రజతం గెలవగా, ఇరాన్ కాంస్యం సొంతం చేసుకుంది. వ్యక్తిగత విభాగాల్లో విఫలమైనప్పటికీ, మిక్స్‌డ్ విభాగంలో ఈ జోడీ అద్భుతంగా పుంజుకుంది.

షూటింగ్‌లోనే భారత్‌కు మరో రజతం కూడా లభించింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌ ఈవెంట్‌లో భారత జట్టు రెండో స్థానంలో నిలిచింది. ఐశ్వరీ ప్రతాప్ సింగ్, రుద్రాంక్ష్ పాటిల్, నీరజ్ కుమార్‌లతో కూడిన భారత త్రయం 1762 పాయింట్లు సాధించింది. ఈ విభాగంలో చైనా స్వర్ణం కైవసం చేసుకుంది.

ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లలోనూ భారత అథ్లెట్లు రాణించారు. పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో గుల్వీర్ సింగ్ రజత పతకం సాధించాడు. మహిళల షాట్‌పుట్‌లో మన్‌ప్రీత్ కౌర్ 17.17 మీటర్ల దూరం విసిరి కాంస్య పతకం నెగ్గింది. పోల్‌వాల్ట్‌లో బరానికా ఎలన్‌గోవన్ చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల పోల్‌వాల్ట్ విభాగంలో పతకం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచి కాంస్యం సాధించింది.

టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో మానుష్ షా, దియా చితాలె జోడీ కాంస్య పతకాన్ని చేజిక్కించుకుంది. సెమీఫైనల్లో చైనా స్టార్ల చేతిలో ఓడిపోయినప్పటికీ కాంస్యంతో సరిపెట్టుకుంది. బాక్సింగ్‌లో సచిన్ సివాచ్ 60 కేజీల విభాగంలో క్వార్టర్‌ఫైనల్ చేరి పతకానికి చేరువయ్యాడు.

కబడ్డీ విభాగంలో భారత జట్లు దూకుడు ప్రదర్శించాయి. పురుషుల జట్టు థాయ్‌లాండ్‌ను, మహిళల జట్టు నేపాల్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లాయి. మహిళల హాకీలో భారత జట్టు 3-1తో ఆతిథ్య జపాన్‌పై విజయం సాధించి సెమీస్ బెర్తు దాదాపు ఖాయం చేసుకుంది. స్క్వాష్‌లో జోష్న చిన్నప్ప, వేలవన్ ద్వయంతో పాటు అనాహత్, అభయ్ కూడా సెమీఫైనల్ చేరి మరో మూడు పతకాలు ఖాయం చేశారు.

The post ఆసియా క్రీడల్లో ప‌సిడి ఖాతా తెరిచిన భార‌త్ appeared first on Adya News Telugu.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి.. !అక్టోబరు నెలలో అన్ని రాశులవారికి కలిసిరావాలంటే ఇవి చేస్తే చాలు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com