☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఫైన‌ల్లో త‌ల‌ప‌డ‌నున్న భార‌త్, పాక్!

ఆసియా క్రీడలు-2026 పురుషుల టీ20 క్రికెట్‌లో హై-వోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. అక్టోబర్ 3న జరిగే ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. అభిమానులు ఈ దాయాదుల సమరం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వర్షం కారణంగా ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు పూర్తిగా రద్దయ్యాయి. దాంతో మెరుగైన ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు నేరుగా సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. తొలి సెమీస్‌‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ విజయం సాధించింది. వర్షం […] The post ఫైన‌ల్లో త‌ల‌ప‌డ‌నున్న భార‌త్, పాక్! appeared first on Adya News Telugu.
ఫైన‌ల్లో త‌ల‌ప‌డ‌నున్న భార‌త్, పాక్!

ఆసియా క్రీడలు-2026 పురుషుల టీ20 క్రికెట్‌లో హై-వోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. అక్టోబర్ 3న జరిగే ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. అభిమానులు ఈ దాయాదుల సమరం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వర్షం కారణంగా ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు పూర్తిగా రద్దయ్యాయి. దాంతో మెరుగైన ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు నేరుగా సెమీఫైనల్‌కు చేరుకున్నాయి.

తొలి సెమీస్‌‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ విజయం సాధించింది. వర్షం వల్ల ఈ మ్యాచ్‌ను 13 ఓవర్లకు కుదించారు. బంగ్లాదేశ్ నిర్దేశించిన 112 పరుగుల లక్ష్యాన్ని పాక్ 11.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సులువుగా ఛేదించింది.

రెండో సెమీఫైనల్‌లో భారత్ 124 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 169 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో శ్రీలంక కేవలం 45 పరుగులకే కుప్పకూలింది. దాంతో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు ఘనవిజయంతో ఫైనల్లో అడుగుపెట్టింది.

ఈ గోల్డ్ మెడల్ మ్యాచ్ జపాన్‌లోని నిశిన్ నగరంలో ఉన్న కొరొగి స్పోర్ట్స్ పార్క్‌‌లో జరగనుంది. అక్టోబర్ 3న భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇదే రోజు ఉదయం 5:30 గంటలకు బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య కాంస్య పతక పోరు జరుగుతుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ ఛానెళ్లలో, సోనీ లివ్ (Sony LIV) యాప్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

భారత జట్టు:

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, యశ్ ఠాకూర్, వైభవ్ సూర్యవంశీ, విప్రజ్ నిగమ్.

పాకిస్తాన్ జట్టు:

సాహిబ్‌జాదా ఫర్హాన్ (కెప్టెన్), సయీమ్ అయూబ్, ఉస్మాన్ ఖాన్, హసన్ నవాజ్, హైదర్ అలీ, అబ్దుల్ సమద్, మొహమ్మద్ వసీం జూనియర్, అబ్రార్ అహ్మద్, సుఫ్యాన్ మొకిమ్, అహ్మద్ డానియాల్, అకిఫ్ జావేద్, అరాఫత్ మిన్హాస్, సాద్ మసూద్, మాజ్ సదాకత్, అలీ రెజా.

The post ఫైన‌ల్లో త‌ల‌ప‌డ‌నున్న భార‌త్, పాక్! appeared first on Adya News Telugu.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఆరేళ్ల చిన్నారి చేసిన సాయం.. ప్రమాదం తృటిలో తప్పింది!ఓటీటీలోకి సోషియో ఫాంటసీ థ్రిల్లర్‌.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com