☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్‌ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్‌ రెడ్డి..!

Balapur Ganesh Laddu Auction: అందరూ ఎదురు చూస్తున్న బాలాపూర్ గణేష్‌ లడ్డూ వేలం ముగిసింది. బాలాపూర్ గణేష్ చివరి పూజా కార్యక్రమం అనంతరం క్రేన్ సహాయంతో బాలాపూర్ గణేషుడ్ని మినీ ట్రక్కుపైకి ఎక్కించి గ్రామ ప్రదక్షిణ నిర్వహించారు. బాలాపూర్ గ్రామ బొడ్రాయి దగ్గరకు గణేష్‌ విగ్రహాన్ని తీసుకవచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట కార్యక్రమం ప్రారంభమైంది. గత ఏడాది రూ. 35 లక్షలు పలికిన లడ్డు ధర.. ఈసారి కమిటీ […]
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్‌ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్‌ రెడ్డి..!

Balapur Ganesh Laddu Auction: అందరూ ఎదురు చూస్తున్న బాలాపూర్ గణేష్‌ లడ్డూ వేలం ముగిసింది. బాలాపూర్ గణేష్ చివరి పూజా కార్యక్రమం అనంతరం క్రేన్ సహాయంతో బాలాపూర్ గణేషుడ్ని మినీ ట్రక్కుపైకి ఎక్కించి గ్రామ ప్రదక్షిణ నిర్వహించారు. బాలాపూర్ గ్రామ బొడ్రాయి దగ్గరకు గణేష్‌ విగ్రహాన్ని తీసుకవచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట కార్యక్రమం ప్రారంభమైంది.

గత ఏడాది రూ. 35 లక్షలు పలికిన లడ్డు ధర.. ఈసారి కమిటీ పాట రూ. 1,116లతో మొదలై గత ఏడాది కంటే 4 లక్షల రూపాయలు అధికంగా అమ్ముడైంది. ఈ ఏడాది బాలాపూర్ లడ్డును రూ. 39 లక్షలతో వేలంలో సామ ప్రణీత్‌ రెడ్డి దక్కించుకున్నారు.

లడ్డు వేలం పాటలో దక్కించుకున్నవారు..

1. 1994 – కొలను మోహన్ రెడ్డి రూ.450,
2. 1995 – కొలను మోహన్ రెడ్డి రూ.4500,
3. 1996- కొలను కృష్ణారెడ్డి – రూ.18,000,
4. 1997- కొలను కృష్ణారెడ్డి – 5.28,000,
5. 1998- కొలను మోహన్ రెడ్డి – 5.51,000,
6. 1999- కళ్లెం ప్రతాప్ రెడ్డి – రూ.65,000,
7. 2000- కళ్లెం అంజిరెడ్డి – రూ.66,000
8. 2001- జి. రఘునందన్ చారి – రూ.85,000
9. 2002- కందాడ మాధవరెడ్డి – రూ.1,05,000
10. 2003- చిగురింత బాల్ రెడ్డి – రూ.1,55,000
11. 2004- కొలన్ మోహన్ రెడ్డి – రూ.2,01,000
12. 2005- ఇబ్రహీం శేఖర్ – రూ.2,08,000
13. 2006- చిగురింత తిరుపతి రెడ్డి – రూ.3,00,000
14. 2007- రఘు నందన్ చారి – రూ. 5,15,000
15. 2008- కొలన్ మోహన్ రెడ్డి – రూ.5,07,000
16. 2009- సరిత – రూ. 5,10,000
17. 2010: కొడాలి శ్రీధర్ బాబు – రూ. 5,35,000
18. 2011: కోలన్ ఫ్యామిలీ – రూ. 5,45,000
19. 2012: పన్నాల గోవర్ధన్ – రూ. 7,50,000
20. 2013: తీగల కృష్ణారెడ్డి – రూ. 9,26,000
21. 2014: సింగిరెడ్డి జైహింద్ రెడ్డి – రూ. 9,50,000
22. 2015: కల్లేం మదన్ మోహన్ రెడ్డి – రూ. 10,32,000
23. 2016: స్కెలాబ్ రెడ్డి – రూ. 14,65,000
24. 2017: నాగం తిరుపతి రెడ్డి – రూ. 15,60,000
25. 2018: శ్రీనివాస్ గుప్తా – రూ. 16,60,000
26. 2019: కోలను రామిరెడ్డి – రూ. 17,60,000
27. 2020: కరోనా కారణంగా వేలం పాట జరగలేదు
28. 2021: మర్రి శశాంక్ రెడ్డి, రమేశ్ యాదవ్ – రూ. 18,90,000
29. 2022: వంగేటి లక్ష్మారెడ్డి – రూ. 24,60,000
30. 2023: దాసరి దయానంద రెడ్డి – రూ. 27,00,000
31. 2024: కోలను శంకర్ రెడ్డి – రూ. 30,01,000
32. 2025: లింగాల దశరథ్ గౌడ్ – రూ. 35,00,000
33. 2026: సామ ప్రణీత్‌ రెడ్డి – రూ. 39,00,000

⬇ Full News JPG⬇ Short News JPG
← PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..Explainer: తడిసి మోపెడు.. ఆస్పత్రులకు వెళ్తే జేబుకు పెద్ద సైజు చిల్లు..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com