☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Balapur Ganesh Laddu | బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూకు రికార్డు ధర.. రూ.39 లక్షలకు దక్కించుకున్న సామ ప్రణీత్‌ రెడ్డి!

Balapur Ganesh Laddu | ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ వేలం పాట ముగిసింది. ఈసారి లడ్డూకు భారీగా పోటీ నెలకొనగా.. సామ ప్రణీత్‌ రెడ్డి అత్యధికంగా రూ.39 లక్షలు చెల్లించి లడ్డూను దక్కించుకున్నారు.
Balapur Ganesh Laddu | బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూకు రికార్డు ధర.. రూ.39 లక్షలకు దక్కించుకున్న సామ ప్రణీత్‌ రెడ్డి!

Balapur Ganesh Laddu | ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ వేలం పాట ముగిసింది. ఈసారి లడ్డూకు భారీగా పోటీ నెలకొనగా.. సామ ప్రణీత్‌ రెడ్డి అత్యధికంగా రూ.39 లక్షలు చెల్లించి లడ్డూను దక్కించుకున్నారు. దీంతో బాలాపూర్‌ లడ్డూ వేలంలో మరోసారి భారీ ధర నమోదైంది.

బాలాపూర్‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన వేలం పాట రూ.1,116 ప్రారంభ ధరతో మొదలైంది. ఈ ఏడాది లడ్డూ వేలం కోసం మొత్తం తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఐదు కంపెనీల ప్రతినిధులు ఉండటంతో వేలంలో పోటీ మరింత పెరిగింది. లడ్డూ కోసం కంపెనీలు కూడా బరిలోకి రావడం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చివరకు సామ ప్రణీత్‌ రెడ్డి రూ.39 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాది బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ రూ.35.70 లక్షలకు విక్రయమైంది. ఈసారి రూ.39 లక్షలకు చేరడంతో గతేడాది కంటే రూ.3.30 లక్షలు అధికంగా ధర పలకడం గమనార్హం.

లడ్డూ వేలం ప్రారంభానికి ముందే బాలాపూర్‌లో సందడి నెలకొంది. వేలం పాటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు గ్రామస్థులు, భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో వేలం ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఇక బాలాపూర్‌ గణేశ్‌ నిమజ్జన శోభాయాత్ర, లడ్డూ వేలం నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌, షీ టీమ్స్‌, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందిని విధుల్లో ఉంచారు. బాలాపూర్‌ పరిసరాలను సీసీ కెమెరాలతో పర్యవేక్షించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← D56 | సితార బ్యాన‌ర్‌లో ధనుష్ కొత్త చిత్రం.. పూజా కార్యక్రమాలతో గ్రాండ్ లాంఛ్!Assam | ముస్లిం వివాహాల తప్పనిసరి రిజిస్ట్రేషన్‌ నిబంధనలకు అస్సాం ఆమోదం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com