☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

AP Telangana Rains: బంగాళాఖాతంలో మారుతున్న సీన్.. అల్పపీడనం ఎఫెక్ట్‌తో ఏపీ, తెలంగాణకు భారీ వర్షాల ముప్పు!

AP Telangana Rains Update: బంగాళాఖాతంలో అక్టోబర్ 13 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది బలపడితే ఏపీ, తెలంగాణలో వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. పూర్తి వివరాలివే..
AP Telangana Rains: బంగాళాఖాతంలో మారుతున్న సీన్.. అల్పపీడనం ఎఫెక్ట్‌తో ఏపీ, తెలంగాణకు భారీ వర్షాల ముప్పు!
  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాయుగుండంగా మారుతుందా?
  • ఎండలకు బ్రేక్ పడనుందా? ఏపీ, తెలంగాణకు వానల అలర్ట్
  • తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. మళ్లీ వర్షాలు కురిసే ఛాన్స్

AP Telangana Rains : ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాలకు బిగ్ గుడ్ న్యూస్.. బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయింది. మళ్లీ ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఉత్తర అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది బలపడితే ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అల్పపీడనం బలపడితే వాయుగుండం?

వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం.. అల్పపీడనం ఏర్పడిన తర్వాత 3 నుంచి 4 రోజుల్లో మరింత బలపడవచ్చు. అనంతరం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉంది.

కొన్ని వాతావరణ నమూనాలు బుధవారం నాటికి వాయుగుండంగా బలపడవచ్చని సూచిస్తున్నాయి. మరికొన్ని మాత్రం అల్పపీడనంగానే కొనసాగే అవకాశాన్ని సూచిస్తున్నాయి. రాబోయే 24 నుంచి 48 గంటల్లో దీనిపై మరింత స్పష్టత రానుంది.

Read Also : Delhi High Alert : ఢిల్లీలో హై అలర్ట్.. జంతర్ మంతర్ నిరసనతో భారీ భద్రత.. మెట్రో స్టేషన్లు బంద్!

ఏపీకి వర్ష సూచన.. :

అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. తీరప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే ముందు అధికారిక వాతావరణ హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలి. సముద్రం అల్లకల్లోలంగా మారే పరిస్థితులు ఉంటే వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

తెలంగాణలోనూ భారీ వర్షాలు :

తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో వాతావరణ మార్పులు చోటుచేసుకోవచ్చు.

ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉండొచ్చు. మొత్తంగా చూస్తే.. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపనుంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Srishti : బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక‌.. తొలిసారి ఫోటోల‌ను షేర్ చేసిన సృష్టి..Saaniya tendulkar : స‌చిన్ కోడ‌లు.. సానియా టెండూల్క‌ర్ గోవా డైరీస్‌ ఫోటోలు.. వైర‌ల్‌.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com