☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

రూ.20 వేలలో మంచి వాషింగ్ మెషీన్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్స్ గురించి తెలుసుకోకపోతే నష్టపోతారు

వాషింగ్ మెషీన్ ఇప్పుడు చాలా ఇళ్లలో తప్పనిసరి వస్తువుగా మారింది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి, పెద్ద కుటుంబాల్లో బట్టలు ఉతకడం పెద్ద పనిగా ఉంటుంది. అయితే రూ.20 వేలకే మంచి ఫుల్లీ ఆటోమేటిక్ మెషీన్ దొరుకుతుందా అనే సందేహం చాలామందికి ఉంటుంది. Samsung, LG, Whirlpool, Haier, Voltas Beko బ్రాండ్లలో ఈ బడ్జెట్‌కు సరిపోయే మోడళ్లు ఉన్నాయి. వీటిలో అవసరానికి తగ్గ ఫీచర్లు కూడా లభిస్తాయి. సరైన మోడల్ ఎంచుకుంటే సమయం, శ్రమ రెండూ ఆదా అవుతాయి.
రూ.20 వేలలో మంచి వాషింగ్ మెషీన్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్స్ గురించి తెలుసుకోకపోతే నష్టపోతారు

ఎక్కువ ధర పెడితేనే మంచి వాషింగ్ మెషీన్ వస్తుందనుకోవాల్సిన అవసరం లేదు. రూ.20 వేలలోపు బడ్జెట్‌లోనే ఇన్వర్టర్ టెక్నాలజీ, పలు వాష్ ప్రోగ్రామ్‌లు, సేఫ్టీ ఫీచర్లు, మంచి కెపాసిటీ ఉన్న మోడళ్లు లభిస్తున్నాయి. కుటుంబ సభ్యుల సంఖ్య, నీటి లభ్యత, స్పిన్ స్పీడ్, మోటార్ వారెంటీ వంటి అంశాలను చూసి కొనుగోలు చేస్తే రోజువారీ వాడకంలో ఇబ్బందులు తగ్గుతాయి. ముఖ్యంగా మెషీన్ సామర్థ్యం కుటుంబ అవసరాలకు సరిపోవాలి. అప్పుడే డబ్బుకు తగిన ప్రయోజనం ఉంటుంది.

రూ.20 వేలలోపు అందుబాటులో ఉన్న బ్రాండ్లు

  • Samsung Ecobubble మోడళ్లలో బట్టల లోపలికి డిటర్జెంట్ వేగంగా చేరేలా చేసే టెక్నాలజీ ఉంటుంది. చల్లని నీటితోనే మంచి శుభ్రత అందించడమే కాకుండా డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు సాయపడుతుంది. తక్కువ శబ్దంతో పనిచేయడం మరో ప్రత్యేకత.
  • LG టాప్ లోడ్ ఫుల్లీ ఆటోమేటిక్ మెషీన్లలో Turbo Drum, Smart Inverter వంటి ఫీచర్లు కనిపిస్తాయి. బట్టలను జాగ్రత్తగా ఉతికేలా వీటిని రూపొందించారు. Auto Restart, Child Lock వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.
  • Whirlpool White Magic మోడళ్లలో Hard Water Wash, Spot Wash, Zero Pressure Fill వంటి ఫీచర్లు ఉన్నాయి. నీటి సమస్య లేదా ఉప్పు నీరు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇవి ఉపయోగపడేలా రూపొందించారు.
  • Haier, Voltas Beko బ్రాండ్లలో రూ.20 వేలలోపు 7.5 కేజీ నుంచి 8 కేజీ వరకు కెపాసిటీ ఉన్న మోడళ్లు లభిస్తాయి. డిజిటల్ డిస్‌ప్లే, పలు వాష్ ప్రోగ్రామ్‌లు, Quadra Steel Pulsator వంటి ఫీచర్లు ఉంటాయి.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు..

2–3 మంది ఉన్న కుటుంబానికి 6.5 నుంచి 7 కేజీ కెపాసిటీ సరిపోతుంది. 4–5 మంది ఉంటే కనీసం 8 కేజీ మెషీన్ తీసుకోవడం మంచిది. స్పిన్ స్పీడ్ ఎక్కువగా ఉంటే బట్టల్లోని నీరు త్వరగా బయటకు వెళ్లి ఆరే సమయం తగ్గుతుంది. ఈ బడ్జెట్‌లో 700 నుంచి 740 RPM వరకు స్పిన్ స్పీడ్ సరిపోతుంది.

మోటార్ వారెంటీని కూడా తప్పకుండా చూడాలి. కనీసం 5 నుంచి 10 సంవత్సరాల వారెంటీ ఉన్న మోడల్‌ను ఎంచుకోవడం మంచిది. నీటి వినియోగం, వాష్ ప్రోగ్రామ్‌లు, సేఫ్టీ ఫీచర్లు, ఇంట్లో ఉన్న స్థలం కూడా ముందే చూసుకోవాలి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Vastu Tips: ఈశాన్య మూలలో ఈ వస్తువులు ఉంటే ఆర్థిక ఇబ్బందులేనట.. వెంటనే తొలగించండి!Quick Breakfast Recipe: పిల్లలు లొట్టలేసుకుని తినే పెసరపప్పు టిఫిన్.. కూరగాయలతో ఇలా చేస్తే సూపర్ టేస్ట్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com