☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

భట్టి కాళ్లు మొక్కిన విజయ్ దేవరకొండ

Vijay Devarakonda : టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, తన సతీమణి రష్మిక మందన్నతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నివాసానికి వెళ్లారు....
భట్టి కాళ్లు మొక్కిన విజయ్ దేవరకొండ

Vijay Devarakonda : టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, తన సతీమణి రష్మిక మందన్నతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నివాసానికి వెళ్లారు. విజయ్, రష్మిక వివాహం తర్వాత వారికి ఇది తొలి దసరా పండుగ కావడంతో, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు వారిని సాదరంగా ఆహ్వానించి నూతన వస్త్రాలు అందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క కాళ్లకు విజయ్ దేవరకొండ నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. భట్టి నివాసానికి వెళ్లడం ద్వారా విజయ్ తాను ఏ ఒక్క వర్గానికి లేదా రంగానికి మాత్రమే పరిమితం కాదని, అందరినీ కలుపుకునిపోయే వ్యక్తిత్వం తనదని మరోసారి చాటిచెప్పారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Read Also : ఏపీ, తెలంగాణ రెండు కళ్ల వంటివి – దిల్ రాజు

టాలీవుడ్‌పై భట్టి వ్యాఖ్యలు.. సమాజిక స్పృహపై విజయ్‌కి ప్రశంసలు!

అంతకుముందు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ‘యంగ్ ఫిల్మ్ మేకర్స్ అవార్డుల వేడుక’లో ముఖ్య అతిథిగా పాల్గొన్న భట్టి విక్రమార్క టాలీవుడ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో టాలీవుడ్ హైదరాబాద్ కేంద్రంగా ఉన్నప్పటికీ నాయకత్వం ఇతర ప్రాంతాలదే అనే భావన ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితి మారి తెలంగాణకు చెందిన నటులు, దర్శకులు, నిర్మాతలు పరిశ్రమలో సత్తా చాటుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీరు, విద్యుత్ పొదుపు వంటి సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విజయ్ దేవరకొండ ముందుకొచ్చారని కొనియాడారు. విజయ్ మార్గంలోనే మిగతా హీరోలు కూడా సామాజిక స్పృహతో ముందుకు రావాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గాదేవి అలంకారంలో కనకదుర్గమ్మనిర్మాణ పనులపై అంతర్జాతీయ నిపుణుల కీలక సూచనలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com