☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

Bhumana Karunakar Reddy: తప్పుడు ప్రచారంపై భూమన ఫైర్‌.. ఇందుకేనా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు జీతాలు..?

Bhumana Karunakar Reddy: తిరుపతిలో టీడీపీ సోషల్ మీడియాపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీ మంత్రి ఆర్‌కే రోజా శ్రీవారి దర్శనానికి వెళ్లిన సమయంలో తలనీలాలు సమర్పించినట్లుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని జరగని విషయాన్ని జరిగినట్లుగా చూపిస్తూ దుర్మార్గంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కేబినెట్‌లో నిర్ణయం తీసుకుందని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారం చేసేందుకు […]
Bhumana Karunakar Reddy: తప్పుడు ప్రచారంపై భూమన ఫైర్‌.. ఇందుకేనా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు జీతాలు..?

Bhumana Karunakar Reddy: తిరుపతిలో టీడీపీ సోషల్ మీడియాపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీ మంత్రి ఆర్‌కే రోజా శ్రీవారి దర్శనానికి వెళ్లిన సమయంలో తలనీలాలు సమర్పించినట్లుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని జరగని విషయాన్ని జరిగినట్లుగా చూపిస్తూ దుర్మార్గంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కేబినెట్‌లో నిర్ణయం తీసుకుందని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారం చేసేందుకు జీతగాళ్లను తయారు చేస్తున్నారని భూమన ఆరోపించారు. ప్రభుత్వ సొమ్మును ఐటీడీపీ ద్వారా టీడీపీ కార్యకర్తలకు ఉపయోగిస్తూ.. తీవ్రమైన వ్యాఖ్యలు, అసభ్య పదజాలం, వ్యక్తిత్వ హననానికి సోషల్ మీడియాను వాడుతున్నారని విమర్శించారు. తాము చేయని అభివృద్ధికి గొప్పలు చెప్పుకునేందుకు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని భూమన మండిపడ్డారు. శ్రీవారిని దర్శించుకునే ఎవరైనా, ఎంతటివారైనా తలనీలాలు సమర్పించే సంప్రదాయం ఉందన్నారు. రోజా తలనీలాలు సమర్పించకపోయినా చేసినట్లుగా ప్రచారం చేస్తూ కొందరు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఇలాంటి దుర్మార్గపు చేష్టలను చూసి ప్రజలు అసహ్యించుకుంటారని.. వాటివల్ల ఎలాంటి రాజకీయ ప్రయోజనం ఉండదన్నాదు . ఇలాంటి పనులు చేసిన వారి సంగతి భగవంతుడే చూస్తారన్నారు భూమన కరుణాకర్‌రెడ్డి .

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← రూ.5.49 లక్షలకే Tata Aeris.. 6 ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లతో బెస్ట్ ఫ్యామిలీ కారు విడుదల!Garlic-Onion Chutney Recipe: వెల్లుల్లి, ఉల్లిపాయతో ఘాటైన చట్నీ.. రోటీ, అన్నంతో అదిరిపోతుంది.. కూర లేకపోయినా పర్లేదు..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com