తెలుగు రియాలిటీ షోలలో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’ రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. ఉత్కంఠభరితమైన టాస్క్‌లు, కంటెస్టెంట్ల మధ్య గొడవలు, ఎమోషన్స్‌తో హౌస్‌లో వాతావరణం వేడెక్కుతోంది. ఇక ఆట ఐదు వారాలు పూర్తి చేసుకుని ఆరో వారంలోకి అడుగుపెట్టగా, ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ మరింత రచ్చ రచ్చగా సాగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈవారం ఎలిమినేషన్‌కు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు, ఓటింగ్ ట్రెండ్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ ఆరోవారంలో హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో నిలిచారు. వీరిలో ముగ్గురు సెలబ్రిటీలు (వర్షిణి, రామ్ ప్రసాద్, వంశీ) కాగా, మరో ముగ్గురు కామనర్స్ (షాలిని, అమన్ మసూద్, రోహిత్) ఉన్నారు. సాధారణంగా నామినేషన్స్ అనగానే ఎవరి ఫ్యాన్ బేస్ బట్టి వాళ్లకు ఓట్లు పడాలి. కానీ ఈసారి మాత్రం లెక్కలన్నీ పూర్తిగా తారుమారయ్యాయి.
ఎక్కువ మంది చదివినవి : Nartanasala Movie: బృహన్నలగా ఎన్టీఆర్ విశ్వరూపం.. నర్తనశాల వెనుక ఉన్న ఈ అరుదైన నిజాలు తెలుసా.. ?
ముఖ్యంగా మొదటి నుంచి నెట్టింట పూర్తిగా నెగిటివిటీ మూటగట్టుకున్న షాలిని ఈసారి కూడా ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయినట్లు తెలుస్తోంది. అయితే మొన్నటివరకు డేంజర్ జోన్ లో టెంపర్ వంశీ, యాంకర్ వర్షిణి ఉండగా.. ఒక్కరోజు ఆట తీరుతో వంశీ దెబ్బకు టాప్ లోకి దూసుకొచ్చాడు. దీంతో ఈసారి యాంకర్ వర్షిణి బయటకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో భారీ ఫాలోవర్లు ఉన్న ప్రముఖ నటి, యాంకర్ వర్షిణి ఈ వారం ఊహించని విధంగా డేంజర్ జోన్లో నిలవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి గత వారాల్లో కూడా ఆమె డేంజర్ జోన్లోకి వెళ్లినా వివిధ కారణాల వల్ల సేవ్ అవుతూ వచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే చాలు జీవితం మారిపోతుంది.. డబ్బు సంపాదనకు మురళీ మోహన్ ఇచ్చిన సలహాలు..
అయితే ఈసారి మాత్రం ఓటింగ్ శాతంలో ఆమె వెనుకబడి ఉండటం అభిమానులను కలవరపెడుతోంది. మరోవైపు రోహిత్ ఓటింగ్‌లో టాప్‌లో కొనసాగుతుండగా, మిగతా కంటెస్టెంట్ల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఈవారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో విపరీతంగా పెరిగింది. ఈసారి వర్షిణి బయటకు రానున్నట్లు తెలుస్తోంది.
ఎక్కువ మంది చదివినవి : Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఇదేం సినిమా రా నాయనా.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చి దుమ్ములేపుతున్న మూవీ.. ట్రెండింగ్ నంబర్ 1గా రచ్చ రచ్చ..


