☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Bihar Woman Assault : బీహార్ లో మరో దారుణ ఘటన.. టూరిస్ట్ స్పాట్‌లో యువతికి వేధింపులు.. చెప్పులతో దాడి..

Bihar Woman Assault : బిహార్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మందర్ హిల్ వద్ద ఓ యువతిపై ఆరుగురు యువకులు అసభ్యంగా ప్రవర్తించి, చెప్పులతో దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
Bihar Woman Assault : బీహార్ లో మరో దారుణ ఘటన.. టూరిస్ట్ స్పాట్‌లో యువతికి వేధింపులు.. చెప్పులతో దాడి..

Bihar Woman Assault : బిహార్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మందర్ హిల్ వద్ద ఓ యువతిపై ఆరుగురు యువకులు అసభ్యంగా ప్రవర్తించి, చెప్పులతో దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Also Read : Air India Pilot Suspended : జ్యూరిచ్‌లో ఎయిర్ ఇండియా పైలట్‌కు షాక్.. టెస్ట్‌లో ఫెయిల్.. వెంటనే సస్పెన్షన్!

బిహార్‌లోని బాంకా జిల్లాలో ఉన్న మందర్ హిల్‌ పర్యాటక ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. కొందరు యువకులు ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తూ కనిపించారు. ఆమెపై చెప్పులతో దాడి చేసినట్లు కూడా వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోపై సెప్టెంబర్ 3 తేదీ కనిపిస్తున్నప్పటికీ, పోలీసుల దృష్టికి మాత్రం సెప్టెంబర్ 22న వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ఆధారంగా పోలీసులు సుమోటోగా తీసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

పోలీసు బృందం మందార్ హిల్‌కు వెళ్లి వీడియోలో కనిపిస్తున్న ప్రదేశాన్ని పరిశీలించింది. అది మందార్ హిల్ ప్రాంతమేనని నిర్ధారించింది. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు గుర్తుతెలియని యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక గ్రామస్తులు, దుకాణదారులను విచారిస్తూ వీడియోలో కనిపిస్తున్న యువకులు, బాధితురాలి వివరాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుల ఆచూకీ లభించలేదు. నిందితులను గుర్తించిన తర్వాత చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఇటీవల జాముయి జిల్లాలో స్నేహితులైన ఇద్దరు టీనేజర్లు.. కోచింగ్‌ సెంటర్‌కు వెళ్లి వస్తుండగా రోడ్డుపైనే దుండగులు అడ్డగించిన సంగతి తెలిసిందే. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన మరవక ముందే సమస్తీపుర్‌ జిల్లాలోనూ ఓ టీనేజీ అమ్మాయి, అబ్బాయి కలిసి రోడ్డుపై నడుచుకుంటూ ఫొటోలు తీసుకుంటుండగా కొందరు ఆకతాయిలు అడ్డగించి అమానుషంగా ప్రవర్తించారు. ఇలా వరుస ఘటనలు బిహార్‌లో రాజకీయ దుమారం రేపాయి. తాజాగా మందర్ హిల్ వద్ద ఓ యువతిపై ఆరుగురు యువకులు అసభ్యంగా ప్రవర్తించి ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← కళ్లజోడుతో క్యూట్ లుక్.. యాంకర్ మంజూష స్టైలిష్ ఫొటోలు వైరల్!Shiva Jyothi : యాంక‌ర్ శివ‌జ్యోతి కూతురితో ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ భార్య‌, కూతురు.. క్యూట్ ఫోటోలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com