☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఉదయపు టిఫిన్‌గా అదిరిపోయే కమ్మని బియ్యపు రవ్వ పులిహోర.. తింటే రించికి ఫిదా అవ్వాల్సిందే

తెలుగువారి పండుగలలో, పూజా కార్యక్రమాలలో నైవేద్యం అనగానే మొదటిగా గుర్తొచ్చేది పులిహోర. అయితే అన్నంతో కాకుండా పూర్వం అమ్మమ్మలు, నానమ్మలు బియ్యపు రవ్వతో చేసే 'రవ్వ పులిహోర' దీనినే పిండి పులిహోర అని కూడా అంటారు రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది. చాలామంది బియ్యపు రవ్వ అనగానే ఉప్మా రవ్వ లేదా ఇడ్లీ రవ్వ అనుకుంటారు; కానీ బియ్యంతో కొద్దిగా లావుగా పట్టించిన బియ్యపు రవ్వ మార్కెట్లో విడిగా లభిస్తుంది.
ఉదయపు టిఫిన్‌గా అదిరిపోయే కమ్మని బియ్యపు రవ్వ పులిహోర.. తింటే రించికి ఫిదా అవ్వాల్సిందే
Biyyam Rava Pulihora (1)

కావలసిన పదార్థాలు: 250 గ్రాముల బియ్యపు రవ్వ, 4 కప్పులు నీళ్లు ఇక్కడ రవ్వ తీసుకున్న కప్పు కొలతతో నీళ్లు తీసుకోవాలి, 2 టీస్పూన్లు ఉప్పు, అర టీస్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల వంట నూనె, 4 మీడియం సైజు నిమ్మకాయల రసం. ఘుమఘుమలాడే తాలింపు కోసం: 4 టేబుల్ స్పూన్ల నూనె, కొద్దిగా వేరుశనగ గుళ్లు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్లు, 1 టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సన్నని అల్లం తరుగు, 5-6 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 3-4 ఎండుమిర్చి, తాజా కరివేపాకు, పావు టీస్పూన్ ఇంగువ చాలా ముఖ్యం.

Biyyam Rava Pulihora (2)

తయారీ విధానం: అడుగు మందంగా ఉన్న పాత్ర లేదా పాన్‌లో 4 కప్పుల నీళ్లు పోసి మూతపెట్టి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు 2 టీస్పూన్ల ఉప్పు, అర టీస్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. ఇప్పుడు ఒకటిన్నర కప్పుల బియ్యపు రవ్వను వేస్తూ ఉండలు కట్టకుండా వెంటనే గరిటెతో బాగా కలపాలి. మీడియం మంటపై రెండు నిమిషాలు ఉడికించి, మిశ్రమం దగ్గరపడ్డాక మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లో పెట్టి మూతపెట్టాలి.

Biyyam Rava Pulihora (3)

నీరంతా ఆవిరై రవ్వ మెత్తగా ఉడికేవరకు మధ్యమధ్యలో కలుపుతూ 7 నుండి 10 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ రవ్వను పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారాక ముద్ద లేకుండా చక్కగా పొడిపొడిగా మారుతుంది. మరో పాన్‌లో 4 టేబుల్ స్పూన్ల నూనె వేడిచేసి మొదట పల్లీలు వేసి సగం వేగనివ్వాలి.

Biyyam Rava Pulihora (4)

ఆ తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా ఎర్రగా వేయించాలి. అనంతరం సన్నని అల్లం ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి అల్లం పచ్చివాసన పోయేలా వేపాలి. చివరగా పావు టీస్పూన్ ఇంగువ వేసి స్టవ్ ఆపేయాలి.

Biyyam Rava Pulihora (5)

పోపు ఉన్న పాత్రలోకి లేదా వెడల్పాటి తాంబూలంలోకి చల్లారిన బియ్యపు రవ్వను వేయాలి. దీనిపై 4 నిమ్మకాయల రసాన్ని పోయాలి. గరిటె కంటే చేత్తో నలుపుతూ కలిపితే పోపు, నిమ్మరసం రవ్వకు సమంగా పట్టి ఉండలు లేకుండా పులిహోర పొడిపొడిగా తయారవుతుంది. అంతే, నోరూరించే బియ్యపు రవ్వ పులిహోర సిద్ధం! దేవుడి నైవేద్యానికి ప్రసాదంగా సమర్పించినా, ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తిన్నా అమృతంలా ఉంటుంది

⬇ Full News JPG⬇ Short News JPG
← Indian Railways: రైలు ఆలస్యమైందా..? రైల్వే స్టేషన్‌లో రూ.100కే లగ్జరీ రూమ్స్.. ఆన్‌లైన్‌లో సింపుల్‌గా బుక్ చేస్కోండిలా..EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఇక డబ్బులు విత్‌డ్రా చేయడం మరింత ఈజీ! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com