☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Brij Bhushan | లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూష‌ణ్‌కు షాక్.. నిర్దోషిగా ప్ర‌క‌టించ‌డాన్ని స‌వాల్ చేసిన రెజ్ల‌ర్లు

Brij Bhushan : రెజ్లింగ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా (డ‌బ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్య‌క్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ సింగ్‌కు షాక్ త‌గిలింది. లైంగిక వేధింపుల కేసులో ఆయ‌న నిర్దోషిత్వాన్ని స‌వాలు చేస్తూ న‌లుగురు మ‌హిళా రెజ్ల‌ర్లు కోర్టును ఆశ్ర‌యించారు.
Brij Bhushan | లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూష‌ణ్‌కు షాక్.. నిర్దోషిగా ప్ర‌క‌టించ‌డాన్ని స‌వాల్ చేసిన రెజ్ల‌ర్లు

Brij Bhushan : రెజ్లింగ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా (డ‌బ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్య‌క్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ సింగ్‌కు షాక్ త‌గిలింది. లైంగిక వేధింపుల కేసులో ఆయ‌న నిర్దోషిత్వాన్ని స‌వాలు చేస్తూ న‌లుగురు మ‌హిళా రెజ్ల‌ర్లు కోర్టును ఆశ్ర‌యించారు. ఈ మేర‌కు సెష‌న్స్ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. బ్రిజ్ భూష‌ణ్ సింగ్‌తోపాటు మ‌రో నిందితుడు వినోద్ తోమార్‌పై కూడా పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో శ‌నివారం ఈ కేసు విచార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. బ్రిజ్ భూష‌ణ్ సింగ్‌పై మ‌హిళా రెజ్ల‌ర్లు లైంగిక వేధింపుల ఆరోప‌ణలు చేశారు. ఈ అంశంపై ఇటీవ‌ల మెజిస్ట్రేట్ కోర్టు బ్రిజ్ భూష‌ణ్ సింగ్‌ను నిర్దోషిగా ప్ర‌క‌టించింది. దీంతో తాము కోర్టులో స‌మ‌ర్పించిన సాక్ష్యాలను త‌ప్పుగా, ప‌రిమితంగానే ప‌రిశీలించార‌ని పిటిష‌న్ దాఖ‌లు చేసిన రెజ్ల‌ర్లు కోర్టుకు వివ‌రించారు. ఈ విష‌యంలో మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు అంచ‌నాలు, ఊహాగానాల ఆధారంగా జ‌రిగింద‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. కోర్టు విచార‌ణ స‌రిగ్గా జ‌ర‌గ‌లేద‌ని, స‌రైన చ‌ట్టాలు వ‌ర్తించేలా ప‌రిశీల‌న జ‌ర‌గ‌లేద‌ని పిటిష‌న్‌లో వివ‌రించారు.

ఇదే స‌మ‌యంలో త‌మ ప్ర‌వ‌ర్త‌న, వ్య‌క్తిత్వం విష‌యంలో కూడా త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని కోర్టుకు తెలిపారు. లైంగిక వేధింపుల బాధితులు ఎలా ప్ర‌వ‌ర్తిస్తారు అనే అంశంలో ఉన్న పాత‌కాల‌పు ప‌ద్ధ‌తుల్ని, అంచ‌నాల్ని ఆధారంగా చేసుకుని కోర్టు బ్రిజ్ భూష‌ణ్ సింగ్‌ను నిర్దోషిగా ప్ర‌క‌టించింద‌ని రెజ్ల‌ర్లు ఆరోపించారు. ఈ కేసు త‌దుప‌రి విచార‌ణ‌లో భాగంగా.. మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును, విచార‌ణ తీరును కూడా ప‌రిశీలించాల్సిందిగా కోరారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Tollywood | తెలుగులోకి ‘హనుమాన్ అన్శ్’.. త్రివిక్రమ్ తప్పుకోవడంతో ఇప్పుడు హోంబళే ఫిల్మ్స్ ఎంట్రీ?Salt Vs Sugar | ఉప్పు వ‌ర్సెస్ చ‌క్కెర‌.. గుండె ఆరోగ్యానికి ఏది ఎక్కువ హాని చేస్తుంది..? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com