☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

‘ప్రజాపాలన కాదు.. ప్రతీకార పాలన’.. బోయినపల్లి బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టుపై కొంకటి శేఖర్‌ ఆగ్రహం

సీఎం రేవంత్‌రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన నేపథ్యంలో బోయినపల్లి మండలానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోవడంపై ఆ పార్టీ నాయకుడు కొంకటి శేఖర్‌ మండిపడ్డారు.
‘ప్రజాపాలన కాదు.. ప్రతీకార పాలన’.. బోయినపల్లి బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టుపై కొంకటి శేఖర్‌ ఆగ్రహం

సీఎం రేవంత్‌రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన నేపథ్యంలో బోయినపల్లి మండలానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోవడంపై ఆ పార్టీ నాయకుడు కొంకటి శేఖర్‌ మండిపడ్డారు. ఉదయం 4 గంటలకే నాయకులను అరెస్టు చేయడం దారుణమని ఆయన విమర్శించారు.

సీఎం సభ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు, ప్రజాస్వామ్యవాదులు సభ వద్ద నిరసన వ్యక్తం చేయకుండా ముందస్తు అరెస్టులు చేస్తున్నారని కొంకటి శేఖర్‌ ఆరోపించారు. ‘ప్రజాపాలన’ అని చెబుతూ మరోవైపు ‘ప్రతీకార పాలన’ సాగిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాజకీయ కార్యక్రమాల కోసం ప్రజాధనాన్ని వినియోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. అధికారంలో ఉన్నామనే కారణంతో పోలీసుల ద్వారా బీఆర్‌ఎస్‌ నాయకులను అరెస్టు చేయిస్తున్నారని విమర్శించారు.

బీఆర్‌ఎస్‌ ప్రజల సమస్యలపై పోరాటాన్ని కొనసాగిస్తుందని కొంకటి శేఖర్‌ తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు తిరిగి కేసీఆర్‌ పాలనను కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.

పలువురు బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టు

బోయినపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో కొంకటి శేఖర్‌, దేశాయిపల్లి సర్పంచ్‌ నిమ్మ శ్రీనివాస్‌రెడ్డి, మన్వాడ సర్పంచ్‌ కట్ట గోవర్ధన్‌, బీఆర్‌ఎస్‌ యువజన నాయకులు మల్లారపు చందు, దూస మధు, వర్ధవెల్లి మాజీ సర్పంచ్‌ రాజు, తిరుపతి, తోంటి మధుకర్‌, నాగుల శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ ఉపసర్పంచ్‌ మోతె ఎల్లారెడ్డి, గురిజాల కోటి, కోనుకటి చంద్రయ్య ఉన్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Encounter | బుద్గాంలో ఎన్‌కౌంట‌ర్‌.. ల‌ష్క‌రే టాప్ క‌మాండ‌ర్ హ‌తం..!Mancherial | తల్లికి వైద్యం అందలేదని.. వీల్‌చైర్‌లో ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లిన కొడుకు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com