☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Jurala project | ఇది ముమ్మాటికి జూరాల రైతుల విజయం : డా.సి.లక్ష్మారెడ్డి

Jurala project | జూరాల ఆయకట్టుకు సాగునీటి కోసం రైతులు చేసిన పోరాటం ఫలించిందని మాజీ మంత్రి డా.సి. లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
Jurala project | ఇది ముమ్మాటికి జూరాల రైతుల విజయం : డా.సి.లక్ష్మారెడ్డి

Jurala project | జూరాల ఆయకట్టుకు సాగునీటి కోసం రైతులు చేసిన పోరాటం ఫలించిందని మాజీ మంత్రి డా.సి. లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎనిమిది రోజుల రైతుల ఆందోళనలకు ప్రభుత్వం తలొగ్గిందని ఇది ముమ్మాటికి రైతుల విజయమన్నారు. ప్రాజెక్టులో నీళ్లు ఉన్నప్పటికి రైతులను కాంగ్రెస్ సర్కార్ అనవసరంగా గందరగోళానికి గురిచేసిందన్నారు. సడన్‌గా నీటి విడుదల బంద్ చేయడంతో పంటలు ఎండిపోతాయనే భయం రైతులను వెంటాడిందన్నారు.

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల జూరాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నీళ్లు విడుదల చేసిందని వానాకాలం సాగు పూర్తి అయ్యే వరకు నీళ్లు విడుదల చేయాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలతీతంగా రైతులకు మద్దతుగా నిలుస్తుందని అందుకే నిన్న ధర్నాకు పిలుపునిచ్చిందన్నారు. కృష్ణా నదిలో వరద ప్రారంభమైనపుడు కూడా బీఆర్ఎస్ ధర్నా పిలుపుతోనే రైతులకు సాగునీరు వచ్చిందని లక్ష్మారెడ్డి గుర్తు చేశారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Harish Rao | హరీశ్‌ రావు వస్తున్నారని తెలిసి కల్వకుర్తి ఎత్తిపోతల మోటర్లను ఆన్ చేసిన రేవంత్ సర్కార్చీరకట్టులో అదరగొట్టేసిన లవ్ టుడే బ్యూటీ ఇవానా →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com