☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!

Government Bank Jobs: బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కేనరా బ్యాంక్ ఒక మంచి అవకాశాన్ని తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ వివిధ శాఖల్లో ఏకంగా 3,500 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తయి మంచి అవకాశం కోసం చూస్తున్నవారికి ఇది చక్కటి వేదిక అని చెప్పుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు బ్యాంకింగ్ రంగంలో శిక్షణ ఇవ్వడమే కాకుండా, ప్రతినెల 16,650 రూపాయల స్టైపెండ్ కూడా అందిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా సబ్జెక్టులో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు కనీసం 20 సంవత్సరాలు ఉండాలి, అలాగే 28 సంవత్సరాలు మించకూడదు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!

Government Bank Jobs: బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కేనరా బ్యాంక్ ఒక మంచి అవకాశాన్ని తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ వివిధ శాఖల్లో ఏకంగా 3,500 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తయి మంచి అవకాశం కోసం చూస్తున్నవారికి ఇది చక్కటి వేదిక అని చెప్పుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు బ్యాంకింగ్ రంగంలో శిక్షణ ఇవ్వడమే కాకుండా, ప్రతినెల 16,650 రూపాయల స్టైపెండ్ కూడా అందిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా సబ్జెక్టులో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు కనీసం 20 సంవత్సరాలు ఉండాలి, అలాగే 28 సంవత్సరాలు మించకూడదు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ ఉన్న వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ప్రక్రియ విషయానికి వస్తే, అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి దరఖాస్తు రుసుముగా 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎంపిక విధానం విషయానికొస్తే ఎలాంటి కఠినమైన పరీక్షలు లేకుండా చాలా సులభంగా ఉంటుంది. విద్యార్హతల్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తీస్తారు. ఆ తర్వాత సర్టిఫికేట్ల పరిశీలన (డాక్యుమెంట్ వెరిఫికేషన్) చేస్తారు. వీటితో పాటు అభ్యర్థులకు స్థానిక భాషపై మంచి పట్టు ఉందో లేదో అని పరిశీలించి తుది ఎంపిక పూర్తి చేస్తారు.

ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత కేనరా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ (www.canarabank.bank.in) ఓపెన్ చేసి, అందులో ‘కెరీర్’ (Career) విభాగంలోకి వెళ్లాలి. అక్కడ ‘Graduate Apprentices in Canara Bank under Apprentices’ అనే లింక్‌పై క్లిక్ చేసి, అప్రెంటిస్ దరఖాస్తు ఫారమ్‌ను ఓపెన్ చేయాలి. అందులో అడిగిన వివరాలన్నీ సరిగ్గా నమోదు చేసి, కావలసిన పత్రాలను అప్‌లోడ్ చేసిన తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను సబ్‌మిట్ చేస్తే సరిపోతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీ వరకు ఆగకుండా వెంటనే అప్లై చేసుకోవడం మంచిది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..SBI ATM Rules Change: ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com